ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

19 Sep, 2021 06:02 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరిస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శు.చతుర్దశి తె.5.06 వరకు (తెల్లవారితే సోమ వారం), తదుపరి పౌర్ణమి, నక్షత్రం శతభిషం తె.4.18 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం ఉ.11.29 నుండి 1.05 వరకు, దుర్ముహూర్తం సా.4.20 నుండి 5.10 వరకు అమృతఘడియలు... రా.9.04 నుండి 10.42 వరకు.

సూర్యోదయం :  5.52
సూర్యాస్తమయం :  5.58
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశి ఫలాలు: 
మేషం...  పనులు మరింత చురుగ్గా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు తోడుగా నిలుస్తారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం....  శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విద్యావకాశాలు దక్కవచ్చు. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మిథునం....  వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.

కర్కాటకం.... రుణదాతల నుంచి ఒత్తిడులు. అనుకోని ధవవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య...  పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

తుల....  పనుల్లో అవాంతరాలు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం....  ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు..  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మకరం....  కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన.

కుంభం....  శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.

మీనం......  వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు