ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు..

26 Nov, 2021 06:15 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.సప్తమి రా.12.14 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష సా.4.32 వరకు, తదుపరి మఖ, వర్జ్యం తె.4.56 నుండి 6.35 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం ఉ.8.26 నుండి 9.10 వరకు, తదుపరి ప.12.10 నుండి 12.54 వరకు అమృతఘడియలు... ప.2.50 నుండి 4.31 వరకు.

సూర్యోదయం :    6.14
సూర్యాస్తమయం     :  5.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

వృషభం: కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు కోసం యత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.

కన్య: శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల: కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృశ్చికం: కొత్త రుణాలు చేస్తారు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం: కుటుంబంలో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

మీనం: కొత్త పరిచయాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వివాదాలు తీరతాయి. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
 

మరిన్ని వార్తలు