కళ్లు చెదిరే లుక్స్‌తో హల్‌చల్‌ చేస్తోన్న మారుతి సుజుకి నయా కారు..! లాంచ్‌ ఎప్పుడంటే..?

9 Apr, 2022 18:42 IST|Sakshi

2022 Maruti Suzuki Ertiga Facelift: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకీ త్వరలోనే అప్‌డేటెడ్‌ 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ను లాంచ్‌ చేయనుంది.ఈ కారుకు సంబంధించిన చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ ఫేస్‌లిఫ్ట్‌ కారుకు సంబంధించిన ప్రీబుకింగ్స్‌ను కూడా కంపెనీ మొదలుపెట్టింది. రూ. 11 వేల టోకెన్‌ అమౌంట్‌ను చెల్లించి కొనుగోలుదారులు 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ బుక్‌ చేసుకోవచ్చును. 

లాంచ్‌ ఎప్పుడంటే..!
ఎంపీవీ వాహనాల్లో మారుతి సుజుకీ ఎర్టిగా భారీ ఆదరణనే పొందింది. ఇప్పుడు పలు మార్పులతో సరికొత్తగా మారుతి సుజుకీ  ఎర్టిగా కారును లాంచ్‌ చేసేందుకు మారుతి సుజుకీ సన్నాహాలను చేస్తోంది. ఈ నెల చివరలో 2022 మారుతి సుజుకీ ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ను కంపెనీ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.  2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ నాలుగు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. సీఎన్‌జీ, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. 

ట్యాక్సీ సెగ్మెంట్ కోసం 2022 ఎర్టిగా  టూర్ వేరియంట్‌ను కూడా మారుతి సుజుకి ఇండియా అందిస్తోంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఎంపికలలో వస్తుంది, ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. 2022 మారుతి సుజుకి ఎర్టిగా పెరల్ ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్, ప్రైమ్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ, పెరల్ డిగ్నిటీ బ్రౌన్, మిడ్‌నైట్ బ్లాక్ షేడ్స్ అనే ఏడు కలర్‌ ఆప్షన్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

అప్‌డేటేడ్‌ డిజైన్‌తో..!
2022 మారుతి సుజుకీ ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ సరికొత్త డిజైన్‌తో రానుంది. కొత్త గ్రిల్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ యూనిట్‌లతో, అప్‌డేటేడ్‌ హెడ్‌ల్యాంప్స్‌తో రిఫ్రెష్ లుక్‌ను పొందనుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే,....ఎర్టిగా స్మార్ట్‌ప్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కొత్త 7-అంగుళాల డిస్‌ప్లేను పొందనుంది. రాబోయే మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో జత చేశారు. నెక్స్ట్-జెన్ కే-సిరీస్ 1.5-లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్‌తో రానుంది. కొత్త పవర్‌ట్రెయిన్‌తో పాటు, మారుతి సుజుకి ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన అధునాతన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా పరిచయం చేస్తోంది.
చదవండి: అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్‌ బెంజ్‌!

మరిన్ని వార్తలు