ఎగాన్‌ లైఫ్‌ ఐ టర్మ్‌ ప్లాన్‌.. స్వయం ఉపాధిలోని వారికి ప్రత్యేకం

9 Jan, 2023 07:14 IST|Sakshi

హైదరాబాద్‌: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ‘ఐటర్మ్‌ ప్రైమ్‌ ఇన్సూరెన్స్‌’ ప్లాన్‌ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్‌లైన్‌ డిస్కౌంట్‌కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ను ఈ ప్లాన్‌ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్‌ లైఫ్‌ ప్రకటించింది.

ఏగాన్‌ లైఫ్‌ వెబ్‌ పోర్టల్‌ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్‌లోడ్‌ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్‌ ఎగ్జిట్‌ వ్యాల్యూ’ ఆప్షన్‌ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్‌ ఇల్‌నెస్, యాక్సిడెంటల్‌ డెత్‌ కవర్‌లను జోడించుకోవచ్చని తెలిపింది.

చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్‌!  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు