స్మార్ట్‌ఫోన్‌ కొంటే రూ.6,000 క్యాష్‌బ్యాక్‌

9 Oct, 2021 06:45 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం రంగంలో ఉన్న భారతి ఎయిర్‌టెల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ ద్వారా రూ.12,000 వరకు ధర గల స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ.6,000 క్యాష్‌బ్యాక్‌ అందుకోవచ్చు. శామ్‌సంగ్, షావొమీ, వివో, ఒప్పో, రియల్‌మీ, నోకియా, ఐటెల్, లావా, ఇన్‌ఫినిక్స్, టెక్నో, లెనోవో, మోటరోలా బ్రాండ్ల ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

150కిపైగా మోడళ్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. రూ.249 ఆపైన ధర గల ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను 36 నెలలపాటు రిచార్జ్‌ చేయాల్సి ఉంటుంది. 18 నెలల తర్వాత రూ.2,000, మిగిలిన రూ.4,000లను 36 నెలలు పూర్తి అయ్యాక చెల్లిస్తారు. అలాగే స్క్రీన్‌ పాడైతే ఒకసారి ఉచితంగా మారుస్తారు. బేసిక్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌ వైపు వినియోగదార్లను అప్‌గ్రేడ్‌ చేసేందుకే ఈ చొరవ తీసుకున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది.   

మరిన్ని వార్తలు