-

సంచలనం, భారత్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు..ఎప్పట్నుంచో తెలుసా!

25 Mar, 2022 11:09 IST|Sakshi

న్యూఢిల్లీ: అధునాతన 5జీ నెట్‌వర్క్‌ పూర్తిగా అందుబాటులోకి వస్తే చాలా అంశాలను సాధ్యం చేసుకునేందుకు అవకాశం ఉందని టెలికం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో దిగ్గజం కపిల్‌దేవ్‌ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా స్టేడియంలో చూస్తున్న అనుభూతిని కలిగించేలా ప్రదర్శన నిర్వహించింది. దీని కోసం 5జీ సాంకేతికతతో కపిల్‌దేవ్‌ వర్చువల్‌ అవతార్‌ హోలోగ్రామ్‌ రూపొందించింది. 

రియల్‌ టైమ్‌లో ఆడియన్స్‌తో సంభాషిస్తున్న అనుభూతి కల్పించింది. ఈ ప్రదర్శన సందర్భంగా వర్చువల్‌ రూపంలో స్టేజీపైన ప్రత్యక్షమైన కపిల్‌దేవ్, ఆడియన్స్‌తో సంభా షించడంతో పాటు అప్ప ట్లో ఇన్నింగ్స్‌ గురించిన విశేషాలు కూడా వివరించారు. 

సెకనుకు 1 గిగాబిట్‌ స్పీడ్‌ ఇంటర్నెట్‌ వేగంతో ఏకకాలంలో 50 మంది యూజర్లు తమ 5జీ స్మార్ట్‌ఫోన్లలో 4కే నాణ్యతతో దీన్ని వీక్షించినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. 2022–23లో 5జీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చే దిశగా కసరత్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు