-

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఐక్యూబ్‌’ అదుర్స్‌.. యూరప్‌ మార్కెట్‌లోకి టీవీఎస్‌

26 Nov, 2023 13:53 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విభాగంలో తయారీ సంస్థల మధ్య పోటీ మొదలైంది. పెట్రోల్‌ ధరలు అధికంగా ఉండడంతో విద్యుత్‌ వాహనాలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. విక్రయాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈవీ మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్‌ సిద్ధమైంది

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విభాగాన్ని మరింత విస్తరించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా వివిధ ధరల్లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. చెన్నై కేంద్రంగా టీవీఎస్‌ ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అమ్ముతుంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. 

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని ఆ సంస్థ సీఈఓ కేఎన్‌.రాధకృష్ణన్‌.. వచ్చే ఏడాది వ్యవధిలో 5- 25 కిలోవాట్ల మధ్య శ్రేణిలో వరుస స్కూటర్లను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం, ఐక్యూబ్‌ డిమాండ్‌ దృష్ట్యా నెలవారీ సామార్ధ్యాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు.  

మరోవైపు రానున్న రెండు, మూడు త్రైమాసికాల్లో మార్కెట్‌లో ఐక్యూబ్‌ను యూరప్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తామన్నారు.దశలవారీగా ఇతర మార్కెట్లకూ విస్తరిస్తామని టీవీఎస్‌ సీఈఓ రాధకృష్ణన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు