Amazon: అమెజాన్‌కు ఈయూ భారీ షాక్!

30 Jul, 2021 20:02 IST|Sakshi

ఈయూ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)ను ఉల్లంఘిస్తూ వ్యక్తిగత డేటాను సేకరించినందుకు అమెజాన్ పై యూరోపియన్ యూనియన్ 886.6 మిలియన్ డాలర్ల (రూ.6,593 కోట్లు) జరిమానా విధించినట్లు ఈ కామర్స్ దిగ్గజం నేడు(జూలై 30) తెలిపింది. లగ్జెమ్‌బర్గ్‌ నేషనల్ కమిషన్ ఫర్ డేటా ప్రొటెక్షన్(సీఎన్ పీడీ) అమెజాన్ యూరోప్ కోర్ పై జూలై 16న జరిమానా విధించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. "అర్హత లేకుండా సీఎన్ పీడీ నిర్ణయం ఉందని మేము నమ్ముతున్నాము, ఈ విషయంలో మమ్మల్ని మేము రక్షించుకోవాలని భావిస్తున్నాము" అని అమెజాన్ తన ఫైలింగ్ లో తెలిపింది.

జీడీపీఆర్ కంపెనీలు తమ వ్యక్తిగత డేటాను ఉపయోగించడానికి ముందు ప్రజల సమ్మతిని కోరాలి లేకపోతే అక్కడి చట్టాల ప్రకారం తీవ్రమైన జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా నిబందనలను ఉల్లంఘిస్తే యూరోపియన్ యూనియన్ గోప్యతా చట్టం కింద సంస్థకు 425 మిలియన్ డాలర్లకు పైగా జరిమానా విధించవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ జూన్ లో నివేదించింది. గతంలో అమెజాన్‌ 300 మిలియన్‌ డాలర్ల(250 మిలియన్‌ యూరోలు) పన్నులు చెల్లించాలంటూ యూరోపియన్‌ కమీషన్‌ జారీ చేసిన ఆదేశాలను స్థానిక కోర్టు రద్దు చేసింది. లగ్జెమ్‌బర్గ్‌ ప్రభుత్వంతో అమెజాన్‌ కుదుర్చుకున్న పన్ను ఒప్పందానికి సంబంధించి 2017లో యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఎగ్జిక్యూటివ్‌ బెంచ్‌ పన్ను ఆదేశాలను జారీ చేసింది.

మరిన్ని వార్తలు