అమెజాన్‌కి గుడ్‌బై చెప్పిన డేవ్‌క్లార్క్‌.. వీడిన 23 ఏళ్ల బంధం..

4 Jun, 2022 17:21 IST|Sakshi

ఈ కామర్స్‌ దిగ్గజ కంపెనీ అమెజాన్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. వరల్డ్‌ వైడ్‌ కన్సుమర్‌ బిజినెస్‌ సీఈవో డేవ్‌క్లార్క్‌ అమెజాన్‌కి గుడ్‌బై చెప్పారు. ఆ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. 2022 జులై 1తో అమెజాన్‌తో పూర్తిగా ఆయన బంధం తెంచుకోనున్నారు. 

కాలేజీలో ఎంబీఏ పట్టా పుచ్చుకోవడం ఆలస్యం 1999లో డేవ్‌క్లార్క్‌ అమెజాన్‌లో చేరారు. అప్పటికీ ఈ కామర్స్‌ రంగం ఇంకా శైశవ దశలోనే ఉంది. అప్పటి నుంచి జెఫ్‌ బేజోస్‌తో కలిసి పని చేస్తూ అంచెలంచెలుగా అమెజాన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్‌ కంపెనీగా తీర్చి దిద్దారు.  

డేవ్‌క్లార్క్‌ తమ సంస్థను వీడి వెళ్తున్న విషయంపై అమెజాన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇదే విషయాన్ని అధికారికంగా అమెరికా స్టాక్‌ మార్కెట్‌ అధికారులకు సైతం తెలిపింది. కంపెనీతో అభిప్రాయ బేధాలు ఏమీ లేవని , ఇతర చోట పని చేయాలనే ఉద్దేశంతోనే క్లా‍ర్క్‌ తమ సంస్థను వీడినట్టు అమెజాన్‌ వివరణ ఇచ్చింది.

చదవండి: Future-Reliance Deal: మోసం చేసేందుకు సహాయపడ్డారు

మరిన్ని వార్తలు