ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

7 Jul, 2021 19:12 IST|Sakshi

ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఆంపియర్ కంపెనీ గుడ్‌న్యూస్‌ అందించింది. ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మకాలను ప్రోత్సహించడానికి గుజరాత్ రాష్ట్రం ఇటీవలే కొత్తగా 2021 ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ ప్రకారం టూ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకునే వాటి ధర మీద రూ. 20,000 సబ్సిడీ అందిస్తుంది. దీంతో అనేక కంపెనీలు ఈ సబ్సిడీ ధరను తగ్గించి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. తాజాగా ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ కూడా మాగ్నస్, జీల్​ మోడల్ స్కూటర్ల అసలు ధరపై రూ.20,000 తగ్గించింది.

గతంలో ఆంపియర్ మాగ్నస్ స్కూటర్ ధర ₹74,990 ధర కాగా, ఇప్పుడు గుజరాత్ కొనుగోలుదారులు ₹47,990 చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా, జీల్​ మోడల్ స్కూటర్ అసలు ధర ₹68,990 కాగా, ఇప్పుడు ₹41,990 (ఎక్స్ షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆంపియర్ ఎలక్ట్రిక్ రాయ్ కురియన్ ఇలా మాట్లాడారు.. "ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు గుజరాత్ ప్రభుత్వం నూతన 2021 ఈవీ పాలసీని ప్రవేశ పెట్టినందుకు ధన్యవాదాలు.. మీరు తీసుకున్న అసాధారణ చర్య వల్ల ఎలక్ట్రిక్ ఒక సామాన్యడికి సులభంగా అందుబాటులో ఉంటున్నాయని" అని ఆయన అన్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పెట్రోల్ ఖర్చులు తగ్గడమే కాకుండా రవాణా ఖర్చుల కూడా భారీగా తగ్గుతాయని ఆయన అన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ₹20,000సబ్సిడీ, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన కొనుగోలుదారులకు ₹1.5 లక్షల సబ్సిడీని ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 250 కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు