ఆనంద్ మహీంద్రాకే కంటతడి పెట్టిస్తోంది! వీడియో వైరల్

1 Oct, 2023 14:36 IST|Sakshi

నిత్యజీవితంలో ప్రతి రోజూ మనసును తాకే సంఘనటనలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటన దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా'ను సైతం కన్నీళ్లు పెట్టుకునే చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, కార్తీక్ సింగ్ అనే ఒక చిన్నారి క్యాన్సర్ చికిత్స కోసం క్రమం తప్పకుండా ఆసుపత్రికి వస్తాడు, వచ్చిన ప్రతిసారి మహీంద్రా థార్ వీడియోలు చూడటం పట్ల, ఆ కారు గురించి మాట్లాడటం పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచేవాడు. అక్కడి వైద్యులతో తానూ పెద్దవాడైన తరువాత మహీంద్రా థార్ కొనుగోలు చేస్తానని చెప్పేవాడు. దీంతో ఆ చిన్నారి కోరికను నెరవేర్చారు.

ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. నిజానికి ఈ వీడియోను అపోలో హాస్పిటల్స్ లక్నో షేర్ చేసింది. హాస్పిటల్ అధికారులు కార్తీక్‌కు సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశారు. దీని కోసం లక్నో సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి అక్కడి సిబ్బందికి విషయాన్ని పూర్తిగా వివరించింది. డీలర్‌షిప్ కూడా వారికి సహాయం సంతోషించారు.

కార్తీక్ తరువాత కీమో సెషన్ షెడ్యూల్ సమయానికి అతనిని పికప్ చేయడానికి మహీంద్రా థార్ అతని ఇంటికి వచ్చింది. అప్పటికే కారు క్యాబిన్ బెలూన్లతో నిండిపోయి ఉంది. ఇది చూసి కార్తిక్ ఎంతగానో సంతోషించాడు. నిజంగా హాస్పిటల్ సిబ్బంది తీసుకున్న చొరవ చాలా అభినందనీయం.

ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు!

తమ కుమారుడిని సంతోషపెట్టేందుకు ఆసుపత్రి అధికారులు చేసిన ప్రయత్నాలకు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు మాటలు రావడం లేదు, కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయంటూ' వెల్లడించాడు. మమ్మల్ని ఈ మంచి పనిలో భాగస్వామ్యం చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ అభిఞ్ఞాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు