ARK SAMYAK Project: పిల్లల కోసం అదిరిపోయే లగ్జరీ ఇళ్లు..హైదరాబాద్‌లో ఎక్కడో తెలుసా!

17 Apr, 2022 21:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్‌ కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ఆర్క్‌ గ్రూప్‌ మరో సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పిల్లలలో మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడేలా వెంచర్‌ డిజైన్‌ను రూపొందించింది. ఇంటర్నేషనల్‌ స్కూల్స్, ఆసుపత్రులు, షాపింగ్‌ కేంద్రాలకు నిలయంగా ఉన్న బాచుపల్లిలో సంయక్‌ పేరిట ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 1.9 ఎకరాలలో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రెండు టవర్లు, ఒక్కోటి పదంతస్తుల్లో ఉంటుంది. మొత్తం 160 ఫ్లాట్లుంటాయి. 1,315 నుంచి 1,760 చ.అ. మధ్య 2, 2.5, 3 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. 7,250 చ.అ. విస్తీర్ణంలో నాలుగు అంతస్తులలో క్లబ్‌హౌస్‌ ఉంటుంది.

 ఈ సందర్భంగా ఆర్క్‌ గ్రూప్‌ సీఎండీ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. నాణ్యత, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. కామన్‌ ఏరియాలలో సౌర శక్తితో నడిచే ఉత్పత్తులను వినియోగించాం. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం చార్జింగ్‌ స్టేషన్లు, విద్యుత్‌ను ఆదా చేసే లైటెనింగ్‌ ఫిక్చర్లను అందుబాటులో ఉంచామని’ వివరించారు. సంయక్‌ ప్రాజెక్ట్‌కు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గోల్డ్‌ రేటింగ్‌ పొందిందని తెలిపారు.  

పిల్లలు వైట్‌ పేపర్‌లాంటోళ్లు.. 
అనంతరం సీఈఓ గుమ్మి మేఘన మాట్లాడుతూ.. వైట్‌ పేపర్‌పై అందమైన కళాకృతులను తీర్చిదిద్దాలంటే అందమైన క్రెయాన్స్‌ లేదా రంగులు ఉండాలి. అలాగే చిన్నతనం నుంచే పిల్లలలో మానసిక ఎదుగుదలకు అనుమైన సదుపాయాలు, మౌలిక వసతులను కల్పిస్తే అద్బుతాలు సృష్టిస్తారని తెలిపారు. అలాగే చిన్నారుల రక్షణ కోసం అన్ని రకాల సాంకేతిక భద్రతా ఏర్పాట్లుంటాయి. స్విమ్మింగ్‌ పూల్‌ అలారం, సేఫ్టీ ఎలక్ట్రిక్‌ సాకెట్, రౌండ్‌ కార్నర్‌ వాల్స్, గేమింగ్‌ ల్యాండ్‌ స్కేప్, కిడ్స్‌ ప్లే సెంటర్, కిడ్స్‌ అవుట్‌డోర్‌ జిమ్, బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లలో సెన్సార్లు, వినైల్‌ ఫ్లోర్‌ వంటివి ఏర్పాట్లుంటాయని వివరించారు. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్, ఆర్గానిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, ప్లంబింగ్‌ పిక్చర్స్‌ వంటి వసతులు కూడా ఉంటాయి. 

చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే!

మరిన్ని వార్తలు