అలర్ట్‌: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్‌!

1 Dec, 2022 16:21 IST|Sakshi

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవన్నీ తరచూ జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని రూల్స్‌ మారుతూ ఉంటాయి, కొన్ని కొత్తవి వస్తుంటాయి. అయితే వీటిలో కొన్నింటిపై మాత్రం సామన్యులు అప్రమత్తంగా ఉండాలండోయ్‌. ఎందుకంటే అవి వారి నగదుపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ డిసెంబరు 1 నుంచి అమలులోకి వచ్చే రూల్స్‌పై ఓ లుక్కేద్దాం..
 
LPG Gas Cylinder Price:
ప్రతీ నెల ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని అంతర్జాతీయ పరిణమాలను అనుసరించి సవరిస్తుంటాయి. ఈ ​క్రమంలో ఒక్కొసారి సిలిండర్ ధరలనేవి పెరగడం, తగ్గడం సహజమే. కొన్ని ధరలు స్థిరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సారి డిసెంబర్ 1కి సంబంధించిన ధరల్ని ఆయిల్ కంపెనీలు తాజా సమాచారాన్ని తెలపాల్సి ఉంది.

Railway time table: చలికాలం వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా, రైళ్ల టైమ్ టేబుల్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అవి డిసెంబర్ 1నుంచి అమలులోకి రానుంది. 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు, 30 రాజధాని రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్‌లో మార్పులు ఉన్నాయి. 

ATM withdraw: డిసెంబర్‌ 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లు కోసం పీఎన్‌బీ ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసే ప్రక్రియ మారనుంది. ఇది మనుపటిలా కాకుండా ఇందులో కాస్త మార్పులను జత చేశారు. కస్టమర్లు తమ డెబిట్ కార్డ్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలంటే ఇకపై వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) అవసరం. ఏటీఎం మెషీన్‌లో మీ డెబిట్‌ కార్డ్‌ను చొప్పించిన తర్వాత, ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీని అందుకుంటారు. అలా వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత, మీ ఏటీఎం పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

PNB KYC: పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి సూచించింది. ఇది చేయకపోతే కస్టమర్ల అకౌంట్‌పై ఆంక్షలు తప్పవని పీఎన్‌బీ హెచ్చరించింది.

Hero Moto Corp: హీరో బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునేవారు ఇది షాకిచ్చే వార్త అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పోలిస్తే ఈ డిసెంబర్‌ నుంచి హీరో బైక్‌ను కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. కంపెనీ తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.1,500 వరకు పెంచింది. పెరిగిన ధరలు డిసెంబర్ 7 నుంచే అమలులోకి రానున్నాయి. 

Digital Rupee: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ పైలట్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 1న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ అనగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, కేవలం ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఉంటారు. 

చదవండి: ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్‌ రియాక్షన్‌

మరిన్ని వార్తలు