మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసిన బిస్లెరీ..! 24x7 ఇంటి వద్దకే డెలివరీ..!

19 Dec, 2021 17:16 IST|Sakshi

ప్యాకేజ్డ్‌ వాటర్‌ దిగ్గజం బిస్లెరీ ఇంటర్నేషనల్‌ డీ2సీ(డైరక్ట్‌ టూ కన్స్యూమర్‌) కాన్స్‌ప్ట్‌ను ప్రోత్సహిస్తూ Bisleri@ Doorstep అనే మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ సహాయంతో వినియోగదారులు నేరుగా ప్యాకేజ్డ్‌ వాటర్‌ను ఇంటికి డెలివరీ పొందే సౌకర్యాన్ని బిస్లెరీ అందుబాటులోకి తెచ్చింది.  ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చును. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో బిస్లెరీ డోర్‌ డెలివరీ సేవలను కంపెనీ అందిస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు, గురుగ్రామ్‌, అహ్మాదాబాద్‌, చెన్నై తదితర నగరాల్లో అందుబాటులో ఉంది.   

బిస్లెరీ మినరల్‌ వాటర్‌ను నిరంతరాయంగా సరఫరా పొందడం కోసం కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 122 ఆపరేషనల్‌ ప్లాంట్‌, 4500 డిస్ట్రిబ్యూటర్స్‌తో దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో 24X7 ప్యాకేజ్డ్‌ వాటర్‌ను డెలివరీ చేయనున్నట్లు బిస్లెరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌-19 రాకతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌ డెలివరీ సేవలను ప్రారంభించినట్లు బిస్లెరీ సీఈవో అంజెలో జార్జ్‌ వెల్లడించారు. 

చదవండి: రెండు నెలల్లో రూ.15 లక్షల కోట్ల సంపద హాంఫట్​..!

మరిన్ని వార్తలు