అదిరిపోయిన బ్రిటన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెడ్ ఆఫీస్ మన హైదరాబాద్‌‌‌‌లోనే!

27 Dec, 2021 15:48 IST|Sakshi

యూకేకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ వన్ మోటో గ్లోబల్‌ భారత మార్కెట్లలోకి మరో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలెక్టాను లాంచ్ చేసింది. గత నెలలో రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల(బైకా, కామ్యూటా) మోడల్స్‌ను లాంచ్‌ చేసిన వన్ మోటో తాజాగా తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలెక్టాను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ.2 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. గత రెండు మోడల్స్‌తో దీని ధర ఎక్కువగానే ఉన్న ఫీచర్స్ వాటి కంటే చాలా బాగున్నాయి. ఈ బైక్స్‌ బుకింగ్స్‌ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.

జియో ఫెన్సింగ్, ఐవోటి, బ్లూటూత్, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ, మొబిలీటీ ట్రాకింగ్‌, బ్యాటరీ స్వాప్‌ అప్షన్స్‌తో రానున్నాయి. వన్ మోటో గ్లోబల్‌ ఇండియాలో అధికారికంగా హైదరాబాద్‌‌‌‌లో తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇది 72వోల్ట్, 45 అంపియర్ గల డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేయడానిక్ నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్ళే సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 

(చదవండి: 2022లో పెరగనున్న కార్లు, బైక్స్‌ కంపెనీల జాబితా ఇదే..!)

దీనిలో 4కెడబ్ల్యు క్యూఎస్ బ్రష్ లెస్ డీసీ హబ్ మోటార్ ఉంది. ఇది మ్యాట్ బ్లాక్, షైనీ బ్లాక్, బ్లూ, రెడ్, గ్రే రంగులలో లభిస్తుంది. ఇందులో డిస్ ప్లే అనలాగ్ రూపంలో ఉంటుంది. ఇది హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులతో వస్తుంది. మోటార్, కంట్రోలర్, బ్యాటరీపై మూడు సంవత్సరాల వారెంటీ కూడా ఉంది. ఎలెక్టా ప్రస్తుతం కంపెనీ నుంచి అత్యంత ఖరీదైన మోడల్. ఈ కంపెనీ మరొక మోడల్ బైకా ధర ₹1.80 లక్షలు కాగా, కమ్యుటా ఈ మూడింటిలో అత్యంత సరసమైనది ₹1.30 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది.

మరిన్ని వార్తలు