బర్గర్ కింగ్‌కు భారీ ఎదురుదెబ్బ

9 Mar, 2021 14:03 IST|Sakshi

విమెన్స్‌ డే రోజు, అనుచితవ్యాఖ్యలు, నెటిజన్లు ఫైర్‌

క్షమాపణ చెప్పిన సంస్థ

సాక్షి, న్యూఢిల్లీ: ఫా‍స్ట్‌ఫుడ్‌ బిజినెస్‌ కింగ్‌ బర్గర్ కింగ్ (యూకే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జెండర్‌పరంగా మహిళలపై వివక్షపూరితంగా ట్వీట్‌  చేసి ఇబ్బందుల్లో పడింది. అందులోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ తన పురుషాధిక్య ధోరణిని  చాటుకోవడం వివాదానికి తెరతీసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పయిందంటూ లెంప లేసుకుంది. అయితే ఆ ట్వీట్‌ను తొలగించిన సంస్థ క్షమాపణ చెబుతూ మరో ట్వీట్‌ చేసింది. ఈ సమయంలో కూడా బర్గర్‌ కింగ్ తీవ్ర విమర్శల పాలైంది. స్వచ్ఛందంగా తప్పును ఒప్పుకోవాల్సిన సంస్థ తీవ్రమైన ట్రోలింగ్‌, అబ్యూసివ్‌ కమెంట్స్‌ కారణంగా ఈ ట్వీట్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతే.. నెటిజన్లు బర్గర్‌ కింగ్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో  భాగంగా విమెన్‌  బిలాంగ్‌ ఇన్‌  ది కిచెన్‌ (మహిళలు వంట ఇంటికి చెందినవారు) అంటూ ట్వీట్‌ చేసింది. ట్వీట్‌తో పాటు న్యూయార్క్ టైమ్స్ ప్రింట్ ఎడిషన్‌లో పూర్తి పేజీ ప్రకటనను ప్రచురించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. "మహిళలు వంటగదిలో ఉన్నారంటూ పెద్ద యాడ్‌ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు బర్గర్‌కింగ్‌పై ఫైర్‌ అయ్యారు. దీనికి తోడు బర్గర్‌ కింగ్‌ సమాధానంతో మరింత మండిపడ్డారు.నెటిజన్లు ట్వీట్ల పరంపర సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (Women's Day: ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు)

మరిన్ని వార్తలు