క్యాపిటాల్యాండ్‌ చేతికి ఐటీ పార్క్‌

30 Dec, 2022 14:38 IST|Sakshi

న్యూఢిల్లీ: సొంత అనుబంధ సంస్థ ద్వారా పుణేలోని ఐటీ పార్క్‌ను కొనుగోలు చేయనున్నట్లు క్యాపిటాల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌ తాజాగా పేర్కొంది. ఎకో స్పేస్‌ ఐటీ పార్క్‌ ప్రయివేట్‌ లిమిటె ద్వారా ఇందుకు అసెండస్‌ ఐటీ పార్క్‌(పుణే)తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఈ ఐటీ సెజ్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి రూ. 1,350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ సెజ్‌ నాలుగు భవంతులతో మొత్తం 2.3 మిలియన్‌ చదరపు అడుగుల విక్రయ అవకాశమున్న ప్రాంతాన్ని కలిగి ఉంది.

ఈ ఆస్తిలో దాదాపు 100 శాతం ఐటీ, ఐటీ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు లీజ్‌కిచ్చారు. వీటిలో ఇన్ఫోసిస్, సినెక్రాన్‌ టెక్నాలజీస్‌ తదితర కంపెనీలున్నాయి. కాగా.. అసెండస్‌ ఐటీ పార్క్‌ లో క్యాపిటాల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌ 78.5 శాతం వాటా, భాగస్వామి మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 21.5 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకోనున్నాయి. 

చదవండి: ముగ్గురు పిల్లలకు.. మూడు టార్గెట్‌లు ఇచ్చిన ముఖేష్‌ అంబానీ!

మరిన్ని వార్తలు