నిబంధనల ప్రకారమే గేమింగ్‌ కంపెనీలకు నోటీసులు

29 Sep, 2023 05:16 IST|Sakshi

సీబీఐసీ చీఫ్‌ అగర్వాల్‌ స్పషీ్టకరణ

న్యూఢిల్లీ: చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్‌ కంపెనీలకు జీఎస్‌టీ ఎగవేత నోటీసులు జారీ చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) చైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేíÙంచిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్, కేసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించేలా సవరించిన నిబంధనలను అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అగర్వాల్‌ చెప్పారు. దీనికి సంబంధించిన చట్ట సవరణలను పార్లమెంటు ఇటీవలే ఆమోదించింది.

అప్పటి నుంచి డ్రీమ్‌11 వంటి ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు, డెల్టా కార్ప్‌ వంటి కేసినో ఆపరేటర్లకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగర్వాల్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 16,800 కోట్ల మేర పన్నులు కట్టాల్సి ఉందంటూ డెల్టా కార్ప్‌కు గత వారం నోటీసులు జారీ అయ్యాయి. రూ. 21,000 కోట్లు రాబట్టుకునేందుకు ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీ గేమ్స్‌క్రాఫ్ట్‌కు గతేడాది షోకాజ్‌ నోటీసులు వచ్చాయి. వీటిని కర్ణాటక హైకోర్టు కొట్టేయగా, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్టోబర్‌ 10న దీనిపై తదుపరి విచారణ జరగనుంది.

మరిన్ని వార్తలు