ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!

18 Jan, 2023 11:33 IST|Sakshi

బీజింగ్‌: కరోనా తెచ్చిపెట్టిన కష్టాలు, రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ దెబ్బతినడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా తర్వాత ప్రపంచ రెండవ అతిపెద్ద ఎకానమీ 2022లో కేవలం 3 శాతం పురోగతి సాధించింది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం,  వార్షిక జీడీపీ విలువ 121.02 ట్రిలియన్‌ యువాన్‌ (17.94 ట్రిలియన్‌ డాలర్లు). 2021 విలువతో (114.37 ట్రిలియన్‌ యువాన్‌లు) పోల్చితే ఈ గణాంకాలు కేవలం 3 శాతం అధికం. కనీసం 5.5 శాతం వృద్ధి నమోదవుతుందన్న అంచనాలకన్నా... గణాంకాలు తగ్గినట్లు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) పేర్కొంది.

1974లో చైనా జీడీపీ వృద్ధి రేటు 2.3 శాతం. అటు తర్వాత ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అమెరికా డాలర్లతో పోల్చితే జీడీపీ విలువ 2021లో 18 ట్రిలియన్‌ డాలర్లుకాగా, తాజాగా 17.94 ట్రిలియన్‌ డాలర్లకు తగ్గడం గమనార్హం. డాలర్‌లో చైనా కరెన్సీ ఆర్‌ఎంబీ బలహీనపడ్డమే దీనికి కారణం. ఎన్‌బీఎస్‌ డేటా ప్రకారం, చైనా జాబ్‌ మార్కెట్‌  2022లో స్థిరంగా ఉంది. పట్టణ వార్షిక ఉపాధి కల్పనా లక్ష్యం 11 మిలియన్‌లుకాగా, 12.06 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. 2021లో చైనా ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతం.

చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!

మరిన్ని వార్తలు