చంద్రుడి మీద ‘మర్మ గృహం’!! ఏలియన్లదే అంటూ చైనా.. సూప్‌ చేసుకుంటారా? అంటూ మనోళ్లు

6 Dec, 2021 17:06 IST|Sakshi

Cube Shaped House On Moon, Viral Photos: ఛాన్స్‌ దొరికిందంటే చాలు.. చైనావాళ్లను సోషల్‌మీడియాలో ఒక రేంజ్‌లోనే ఆడేసుకోవడం మనవాళ్లకు బాగా అలవాటైంది. అంతెందుకు కరోనా వైరస్‌ విషయంలో చైనా పాత్రను ధృవీకరించేసుకుని మరీ ఆడుకున్నంత ఆట అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో ఇప్పుడు మరో సెటైర్‌ పేలుతోంది. 

చైనాకు చెందిన రోవర్‌ ‘యుటు-2’ 2019లో చంద్రుడి మీదకు చేరి, పరిశోధనలు మొదలుపెట్టింది. అయితే తాజాగా ఇది  చంద్రుడి మీద క్యూబ్‌ ఆకారంలో ఒక వస్తువును గుర్తించింది. ఆ ఫొటోల్ని చైనా స్పేస్‌ ఏజెన్సీ సీఎన్‌ఎస్‌ఏ (China National Space Administration) రిలీజ్‌ చేసింది. వోన్‌ కర్మన్‌ ప్రాంతానికి 80 మీటర్ల దూరంలో గుర్తించినట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచే అసలు విషయం మొదలైంది.

ఇదొక మిస్టరీ హౌజ్‌ కావొచ్చని, బహుశా ఏలియన్ల నివాసం కావొచ్చని చైనా స్పేస్‌ రీసెర్చర్లు ముందస్తు ప్రకటనలు ఇచ్చుకున్నారు. మరొకొన్ని రోజుల్లో ఏలియన్ల మిస్టరీ గుట్టు తేలుస్తామంటూ తొందరపడి అధికారిక మీడియా ద్వారా స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. అంతే.. రాళ్లు, రప్పాలపై చైనా చేస్తున్న అతివ్యహారంపై సెటైర్లు పడుతున్నాయి. ఇక ఇలాంటి వన్నీ చైనా వాళ్లకే కనబడతాయంటూ ఇంటర్నెట్‌లో మనవాళ్లు జోకులు, దొరికితే సూప్‌ చేసుకుని తాగుతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. సాధారణంగా యూఎఫ్‌వో-అమెరికా మీద ఎక్కువ ఇంటర్నెట్‌లో వెటకారం కనిపిస్తుంటుంది. 

కానీ, చైనా మీద మాత్రం ఏలియన్ల వ్యవహారంలో జోకులు పేలుతుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. చైనా ఏకంగా ఏలియన్ల ఉనికి కోసమే అడ్డగోలుగా ఖర్చు పెడుతోంది. ఇదివరకే ఏలియన్ల ఉనికిని పసిగట్టడం కోసం భారీ టెలిస్కోప్‌ రాడార్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన డ్రాగన్‌ కంట్రీ.. ప్రత్యేకమైన స్పేస్‌ సెంటర్‌ టియాన్‌గోంగ్‌ను కూడా అందుకే నిర్మిస్తోందంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే చంద్రుడిపై కనిపించిన ఆ ఆకారం.. ఏ స్థూపమో లేదంటే ఏలియన్లకు సంబంధించిందో కాదని, కానీ, ఆసక్తిని రేకెత్తించేదిగా ఉందంటూ స్పేస్‌ డాట్‌ కామ్‌ జర్నలిస్ట్‌ ఆండ్రూ జోన్స్‌ తెలిపారు. రోవర్‌ నుంచి ఆ నిర్మాణానికి కేవలం 80మీటర్ల దూరమే ఉంది. కానీ, చేరుకోవడానికి 3 నెలల టైం పడుతుందట!. అప్పుడుగానీ అదెంటో మిస్టరీ వీడుతుందన్నమాట.


చదవండి: ప్రపంచానిది ఓ దారి.. చైనాది మరో దారి! ఏలియన్ల కోసం ఆరునెలలు..

మరిన్ని వార్తలు