శుద్ధ ఇంధన ఉపకరణాలకు పెద్ద మార్కెట్‌   

24 Feb, 2023 19:07 IST|Sakshi

50 బిలియన్‌ డాలర్ల అవకాశాలు

న్యూఢిల్లీ: శుద్ధ ఇంధన ఆధారిత ఉపకరణాలకు భారీ మార్కెట్‌ ఉందని, 50 బిలియన్‌ డాలర్ల విలువైన మార్కెట్‌ అవాకాశాలు ఉన్నట్టు ఓ నివేదిక తెలియజేసింది. వీటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, ముఖ్యంగా మహిళల సాధికారతకు ఉపకరిస్తుందని పవరింగ్‌ లైవ్‌లీ హుడ్స్‌ అనే నివేదిక వెల్లడించింది.

భారత్‌లో 75 శాతం మహిళా కార్మికులు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న విషయాన్ని ప్రస్తావించింది. వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన (డీఆర్‌ఈ) సాంకేతికతలు విద్యుత్‌ అంతరాయాలకు పరిష్కారమని చెబుతూ.. వీటి వల్ల గ్రామీణ మహిళల ఉత్పాదక పెరుగుతుందని పేర్కొంది. డీఆర్‌ఈ సాంకేతికతలపై లైవ్లీహుడ్‌ ఓ అధ్యయనం నిర్వహించింది. దీనివల్ల 13,000 మందికి పైగా డీఆర్‌ఈ లైవ్లీహుడ్‌ సాంకేతికతలు వాడగా, ఇందులో 10,400 మంది మహిళలు ఉన్నారు. వారి ఆదాయం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది.

మరిన్ని వార్తలు