వామ్మో..! 20 వేల సంవత్సరాల క్రితమే కరోనా వైరస్‌....!

26 Jun, 2021 21:49 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్‌తో ప్రతి దేశం ఇబ్బందిపడుతోంది. వైరస్‌ మొత్తం ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపివేసింది. భారత్‌ లాంటి దేశాలు ఇంకా కరోనా వైరస్‌తో పోరాటాన్నికొనసాగిస్తునే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 కోట్ల మందికి కరోనా వైరస్‌ సోకగా, సుమారు  39 లక్షల మందిని వైరస్‌ పొట్టనపెట్టుకుంది. కాగా కరోనా వైరస్‌పై ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సుమారు 20 వేల సంవత్సరాల క్రితమే తూర్పు ఆసియా ప్రాంతం కరోనా మహమ్మారిని ఎదుర్కొందని పరిశోధనలో తేల్చారు. సుమారు 26 దేశాలకు సంబంధించిన 25 వందల మానవుల డిఎన్‌ఏలను ఈ బృందం పరిశీలించింది. వారి పరిశోధనల ప్రకారం 20 వేల సంవత్సరాల క్రితమే ఈస్ట్‌ ఆసియా ప్రాంతాలు  కరోనా వైరస్‌తో బాధపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఆసియా ప్రాంతాల్లోని వారి డిఎన్‌ఏలో​ కరోనా వైరస్‌ జాడలు కనిపించాయని వెల్లడించారు.

ముఖ్యంగా తూర్పు ఆసియా ప్రాంతాల్లోని చైనా, వియత్నాం, జపాన్‌ వంటి దేశాల వ్యక్తుల జన్యువుల్లో వైరస్‌ గుర్తులను గుర్తించారు.  ఈ పరిశోధనతో గతంలో మానవులు కరోనా వైరస్‌కు గురయ్యారనే విషయం బల్లగుద్ది చెప్పవచ్చునని తెలిపారు.  అంతేకాకుండా కరోనా వైరస్‌ తీవ్రత ఏలా ఉంటుందంటే.. మానవ శరీరం నుంచి వైరస్‌ తొలగిపోయినా, మానవుని డిఎన్‌ఏలో కొంతమేరకు వైరస్‌ గుర్తులుంటాయని పేర్కొన్నారు. వైరస్‌లు మ్యూటేషన్లకు గురై.. కొత్త వేరియంట్లు పుడతాయని ఇది కేవలం వైరస్‌ ఇతర ప్రాణుల్లోకి వెళ్తేనే జరుగుతుందని అధ్యయన సహ రచయిత యాస్సిన్ సౌయిల్మి పేర్కొన్నారు. 

చదవండి: UFO Report; పెంటగాన్‌ ప్రకటన.. కొత్త పాయింట్లు ఉన్నాయన్న రీసెర్చర్లు

మరిన్ని వార్తలు