ఉదయ్‌ కిరణ్‌ ఆగిపోయిన 10 సినిమాలు ఇవే!

26 Jun, 2021 22:11 IST|Sakshi

ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా ఒ వెలుగు వెలిగాడు దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌. నేడు(జూన్‌ 26) అతడి జయంతి. ఈ సందర్భంగా ఒకసారి ఉదయ్‌ సినీ కేరీర్‌పై ఓ లుక్కెద్దాం. ఉదయ్‌ తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్‌ మూవీతోనే సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ఉదయ్‌ కిరణ్‌ సినిమాలన్ని మంచి విజయం సాధించాయి. అలా వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల ఉదయ్‌ కిరణ్‌ సినీ కెరీర్‌ ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఈ క్రమంలో అతడు నటించిన శ్రీరామ్‌ మూవీ ప్లాప్‌ అవ్వడంతో కొంతాకాలం సినిమాలకు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ ‘ఔనన్నా.. కాదన్నా’ మూవీతో ఉదయ్‌కి మరో హిట్‌ అందించాడు. దీంతో మళ్లీ ఉదయ్‌ కిరణ్‌ సినీ కెరీర్‌ గాడిన పడిందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా తర్వాత ఉదయ్‌కి ఆశించిన అవకాశాలు రాలేదు. చేసిన కొన్ని సినిమాలకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఉదయ్‌కి సినిమాల అవకాశాలు దగ్గడమే కాకుండా అప్పటికే ఉదయ్‌తో తీస్తాన్న పలు ప్రాజెక్ట్స్‌ కూడా నిలిచిపోయాయి. అయితే ఇందుకు కారణంగా లేకపోలేదు. అయితే ఉదయ్‌ ఆగిపోయిన ఆ పది క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఏంటో ఓ సారి చూద్దాం.

నర్తనశాల
బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో అప్పటి హీరోయిన్‌ సౌంద‌ర్య ప్రధాన పాత్ర‌లో న‌ర్త‌న‌శాల మూవీకి సన్నాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సౌంద‌ర్య ఆకస్మాత్తు మరణంతో ఈ సినిమా అర్థంత‌రంగా ఆగిపోయింది. అయితే ఇందులోని కీలక పాత్ర అభిమాన్యుడి కోసం ఉద‌య్‌కిర‌ణ్‌ను అనుకున్నారని అప్పట్లో టాక్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

సూపర్ గుడ్ ఫిలింస్‌ బ్యానర్‌లో..
ఈ బ్యానర్‌లో ఉద‌య్ కిర‌ణ్‌, స‌దా జంట‌గా ఓ సినిమాకు తీయాలని భావించారు మేకర్స్‌.  అంతేగాక ఈ చిత్రానకి లవర్స్‌ అనే టైటిల్‌ను కూడా ఖారారు చేశారట. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా పట్టలెక్కలేకపోయింది. కాగా ఈ బ్యానర్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లో తెలుగుతో పాటు పలు తమిళం చిత్రాలు కూడా వచ్చాయి.

అంజనా ప్రొడక్షన్స్ సినిమా
కమర్షియల్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్షన్‌లో ఉద‌య్ కిర‌ణ్‌, అసిన్ జంట‌గా అంజ‌నా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ఒక సినిమా తీయాల‌ని చర్చించుకున్నారు. కానీ అప్ప‌టి ప‌రిస్థితుల దృష్ట్యా ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.

ప్రత్యూష క్రియేషన్స్
ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ ఒక సినిమా మొద‌లు పెడ‌దామ‌ని అనుకుని దీనిపై ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాతా ఈ మూవీ అనుకొకుండా ఆగిపోయింది. 

చంద్రశేఖర్ యేలేటితో..
విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరుగాంచిన చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కూడా ఉద‌య్ కిర‌ణ్‌తో ఓ సినిమా అనుకున్నారట. 

ప్రేమంటే సులువు కాదురా
ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత ఏఎం ర‌త్నం నిర్మాణంలో ఓ సినిమా మొద‌లుపెట్టారు. దాదాపు 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎందుకో తెలియదు కాదు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్‌ చివరి దశలో ఉండగా ఈ చిత్రం నిలిచిపోయింది. 

ఆది శంకరాచార్య
ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆదిశంకరాచార్య‌. ఈ సినిమా ప‌ట్టాలెక్కే స‌మ‌యానికి ఉద‌య్ కిర‌ణ్ మార్కెట్ పడిపోయింది. దీంతో నిర్మాత‌లు సినిమాను ఆపేశారు.

జబ్ వి మెట్ తెలుగు రీమేక్
షాహిద్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్ జంట‌గా రూపొందిన బాలీవుడ్ చిత్రం జ‌బ్ వి మిట్. ఈ మూవీతో హిందీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద‌య్ కిర‌ణ్‌, త్రిష‌ హీరోహీరోయిన్లుగా తెలుగులో ఈ మూవీని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ పట్టాలేక్కలేదు. అయితే త‌మిళంలో ప్రేమిస్తే భ‌ర‌త్‌, త‌మ‌న్నాల‌తో ‘కందేన్ కందాల‌యి’గా ఈ మూవీని చిత్రీక‌రించగా.. తెలుగులోకి ‘ప్రియ‌.. ప్రియ‌త‌మా’ పేరుతో డ‌బ్ అయిన సంగతి తెలిసిందే.

ఎంఎస్ రాజుతో ఓ సినిమా
ఉద‌య్ కిర‌ణ్‌తో మ‌న‌సంతా నువ్వే, నీ స్నేహం వంటి సినిమాలు చేసి మంచి హిట్‌ అందించారు ఎంఎస్ రాజుజ దీంతో ఉదయ్‌ కిరణ్‌తో హ్యాట్రిక్‌గా మ‌రో సినిమా చేయాల‌ని ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది.

తేజతో మరోసారి
ఉద‌య్ కిర‌ణ్‌ను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు తేజ‌. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘చిత్రం’, ‘నువ్వు నేను’ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. ఆ త‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ డైలామా ప‌డిన స‌మ‌యంలో ‘ఔన‌న్నా కాద‌న్న’ సినిమా తీసి హిట్ అందించాడు తేజ. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న ఉద‌య్ కిర‌ణ్‌ను మళ్లీ ఆదుకునేందుకు తేజ మ‌రో సినిమాను ప్లాన్‌ చేశాడు. ఉదయ్‌కి స్టోరీ లైన్‌ కూడా చెప్పాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ సిద్దం చేస్తుండానే ఉదయ్‌ అనుకొకుండా మృతి చెందాడు. ఉదయ్‌ మరణాంతరం ఇదే విషయాన్ని తేజ పలు ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: 
ఓటీటీలోకి రానున్న ఉదయ్‌ కిరణ్‌ చివరి చిత్రం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు