ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, సివిల్‌ ఏవియేషన్‌ మధ్య కీలక ఒప్పందం

24 Nov, 2021 10:55 IST|Sakshi

దేశంలోని ప్రీమియం బిజినెస్‌ ఇన్సిస్టిట్యూట్‌లలో ఒకటిగా ఉన్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌, సివిల్‌ ఏవియేషన్‌ శాఖల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సివిల్‌ ఏవియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ ఉషా పధీ, ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ మిలింద్‌ సోహానీ ఒప్పంద పత్రాల మీద సంతకం చేశారు.
కొత్త సిలబస్‌
దేశీయంగా ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన ప్రయాణాలను చేరువ చేసే లక్క్ష్యంతో కేంద్రం ఉడాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రాంతీయ, జిల్లా కేంద్రాలలో ఎయిర్‌పోర్టులు అభివృద్ది చేయనుంది. ఈ రీజనల్‌ కనెక్టివిటీ పథకం యొక్క ప్రభావం, ప్రయోజనాలు తదితర అంశాలపై ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ లోతైన పరిశోధన చేపట్టి నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ నివేదికను ఓ కేస్‌ స్టడీగా ఇతర విద్యాలయాల్లో, అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్‌స్టిట్యూట్‌లలో ఉపయోగించుకుంటామని పౌర విమానయాన శాఖ చెబుతోంది. 
ట్రాఫిక్‌ పెరిగింది
కోవిడ్‌ సంక్షోభం తర్వాత టూరిజం, భక్తులు ఎక్కుగా వచ్చే ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్‌ పెరిగినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.
 

మరిన్ని వార్తలు