భారత్‌లో ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓ ఎవరో తెలుసా?

11 Dec, 2023 16:16 IST|Sakshi

భారత్‌లో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన థియరీ డెలాపోర్టే అగ్రస్థానంలో నిలిచారు.

2020 నుంచి విప్రో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న డెలాపోర్టే .. వేతనాల విషయంలో దేశీయ మిగిలిన టెక్‌ కంపెనీలు హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌ సీఈఓలను వెనక్కి నెట్టారు. ఏడాదికి రూ.82 కోట్ల వేతనాన్ని పొందుతున్నారు. 

ఈ సందర్భంగా ఫోర్బ్స్‌తో డెలాపోర్టే మాట్లాడుతూ.. ‘‘ విప్రో సీఈఓ పదవికి అర్హులైన వారి కోసం అన్వేహిస్తున్న సమయంలో ఆ సంస్థ ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీని, ప్రస్తుత ఛైర్మన్ అజీమ్ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీని కలిశాను. వారితో మాట్లాడక ముందు భవిష్యత్‌పై నాకు అనేక ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. 

కానీ అజీమ్‌, రిషద్‌తో మూడు, నాలుగు గంటలు గడిపిన తర్వాత నా ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వారి ఇద్దరి మాటల్లో విలువలతో కూడిన ఆశయాలు, ప్రాధాన్యతల గురించి విన్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాను’’ అని డెలాపోర్టే అన్నారు.  

డెలాపోర్టే తర్వాత ఎవరంటే?
ఇక డెలాపోర్టే తర్వాత ఇన్ఫోసిస్‌కు చెందిన సలీల్ పరేఖ్ దేశంలోనే అత్యధిక చెల్లింపులు జరుపుతున్న రెండవ సీఈఓగా అవతరించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదికలో స్టాక్ మార్కెట్‌లోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 500 కంపెనీల విశ్లేషణలో తేలింది. పరేఖ్‌ ఈ ఏడాది రూ. 56.45 కోట్ల జీతం తీసుకున్నారు. రూ. 30 కోట్ల వేతనంతో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ మూడో స్థానంలో నిలిచారు. నాల్గవ స్థానంలో మాజీ టీసీఎస్‌ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రూ. 29 కోట్లకు పైగా సంపాదించారు  

రేసులో కామత్‌ సోదరులు
ఈ ఏడాదిలో అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్‌ డైరక్టర్‌, సీఈఓగా జీరోధా సోదరులు నిలిచారు. జీరోధార ఫౌండర్‌ నితిన్‌ కామ్‌, నిఖిల్‌ కామత్‌లు ఇద్దరూ అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్‌ సీఈఓలుగా ప్రసిద్ధి చెందారు. వారిద్దరి వేతనం ఏడాది రూ.72కోట్లుగా ఉంది. 

>
మరిన్ని వార్తలు