మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే..

11 Dec, 2023 14:34 IST|Sakshi

భారతదేశంలో గత కొన్ని రోజులుగా పడుతూ.. లేస్తూ ఉన్న బంగారం, వెండి ధరలు ఈ నేడు కూడా స్వల్ప దగ్గుదల వైపు కదిలాయి. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5695, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6213గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 56950, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 62130గా ఉంది. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు ఒక్కసారిగా.. రూ. 200 నుంచి రూ. 220 వరకు తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఉంటాయి.

చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5750 (22 క్యారెట్స్), రూ. 6273 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 57500, రూ. 62730గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గినట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: పనిగంటలపై మరోసారి కీలక వ్యాఖ్యలు.. కష్టం వృధా కాలేదు

ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5705, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6123గా ఉంది. దీంతో 10 గ్రాముల గోల్డ్ ధర ఈ రోజు రూ. 57050 (22 క్యారెట్స్), రూ. 61230కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు రూ. 200 తగ్గినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు