డొమినోస్ పిజ్జాతో రివోల్ట్ మోటార్స్ ఒప్పందం

25 Jul, 2021 19:20 IST|Sakshi

డొమినోస్ పిజ్జా తన ప్రస్తుత పెట్రోల్ బైక్ ఫ్లీట్ ను ఈ-బైక్ లుగా మార్చడానికి ఎలక్ట్రిక్ వాహన తయారీదారు రివోల్ట్ మోటార్స్ తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, డొమినోస్ రివోల్ట్ ఆర్ వీ 300 బైక్ మోడల్ ను ఫుడ్ డెలివరీ చేయడం కోసం మారుస్తున్నట్లు తెలిపింది. డొమినోస్ పైలట్ ప్రాజెక్టు కింద రివోల్ట్ బైక్లును గత కొంతకాలంగా ఫుడ్ డెలివరీల కోసం వాడుతున్నారు. రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ బిజినెస్ ఛైర్మన్ అంజలి రట్టన్ మాట్లాడుతూ.. "ఈ భాగస్వామ్యంలో భాగంగా డొమినోస్ సంస్థతో చేతులు కలపడం సంతోషంగా ఉంది, ఇది పర్యావరణపరంగా మంచి నిర్ణయమే కాకుండా, సంస్థకు భారీగా ఖర్చు తగ్గిస్తుంది" అని పేర్కొన్నారు. 

ఈ బైక్ లు వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా వాతావరణానికి హాని కలిగించవని రివోల్ట్ మోటార్స్ తెలిపింది. రాబోయే సంవత్సరాల్లో డెలివరీ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ బైక్ వినియోగించడానికి ఈ భాగస్వామ్యం ఒక ప్రారంభమని రివోల్ట్ విశ్వసిస్తుందని కంపెనీ తెలిపింది. తక్కువ ఉత్పత్తి ఖర్చులు, కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ప్రోత్సాహకాల కారణంగా ఎలక్ట్రిక్ బైక్ల ధరలు భారీగా తగ్గిపోతుండటం ఈ బైక్ లు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి అని కంపెనీ తెలిపింది.
 

మరిన్ని వార్తలు