Donald Trump: పనుల కోసం చుట్టూతిరిగి, ఇప్పుడేమో..

12 Sep, 2021 14:34 IST|Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వా త.. క్యాపిటల్‌ ​హిల్‌ హింస కారణంగా   మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సోషల్‌ మీడియా నిషేధం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛాన్స్‌ దొరికినప్పుడల్లా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ తీరును ఏకీపడేస్తున్నారు ట్రంప్‌.

ప్రముఖ అమెరికన్‌ వ్యాపారవేత్త డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడి.. 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఫాక్స్‌ న్యూస్‌తో జరిగిన ఇంటర్వ్యూలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను తిట్టిపోశాడు. ట్విటర్‌ను తొలినాళ్లలో విఫలమైన ఓ సర్జరీగా వ్యాఖ్యానిస్తూ.. ఆ వెంటనే ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతను (మార్క్‌ జుకర్‌బర్గ్‌) వైట్‌హౌజ్‌కు *********(అభ్యంతరకర కామెంట్లు) కోసమే వచ్చేవాడు. నేను ఫేస్‌బుక్‌ అధినేతను అంటూ భార్యతో సహా వచ్చేవాడు. దానికి నేను ‘ఓ.. అవునా’ అని సమాధానం ఇచ్చేవాడిని, వ్యాపారాల కోసం వాళ్లు ఎంతదాకా అయినా వెళ్లేవాళ్లు అని ట్రంప్‌ వెటకారంగా చెప్పుకొచ్చారు.
 

తమ పనుల కోసం వైట్‌హౌజ్‌ చుట్టూ తిరిగిన జుకర్‌బర్గ్‌ లాంటి టెక్‌ దిగ్గజాలెందరో.. ఇప్పుడు చేతగానీ దద్దమ్మలుగా మారిపోయారంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్‌ దిగ్గజాలుగా గూగుల్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లు  దేశానికి(అమెరికా) చేసిందేం లేదని, పైగా స్వేచ్ఛను హరిస్తోందని ట్రంప్‌ దుయ్యబట్టారు.   కాపిటల్‌ హిల్‌ హింస సమయంలో తన మద్దతుదారుల వీడియోలను పోస్ట్‌ చేయడం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో ట్రంప్‌ను ట్విటర్‌ శాశ్వతంగా బ్యాన్‌ చేయగా.. ఫేస్‌బుక్‌ మాత్రం 2023 వరకు నిషేధం అమలు విధించింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ తాత్కాలిక నిషేధం అమలు చేస్తోంది.

చదవండి: ఫేస్‌బుక్‌ భారీ మోసం?!

మరిన్ని వార్తలు