కోవిడ్‌ విపత్తువేళ డ్యూక్స్‌ ఔదార్యం 

2 Sep, 2020 08:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌–19 విపత్తు వేళ బిస్కెట్స్, వేఫర్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ డ్యూక్స్‌ ఇండియా ఔదార్యం చూపింది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఉద్యోగులు ఇప్పటికే ఒకరోజు వేతనం అందించారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బిస్కెట్లను సరఫరా చేశారు. వలస కార్మికులకు ఆహారం అందించడం, రక్తదానం వంటి కార్యక్రమాలను చేపట్టారు. (చ‌ద‌వండి: ఏజీఆర్‌ తీర్పు- ఎయిర్‌టెల్‌ జోరు)

అలాగే విపత్తు నుంచి బయటపడతామన్న సందేశంతో విభిన్న భాషల మేళవింపుతో 14 మంది కళాకారులచే రూపొందిన ‘వాయిసెస్‌ యునైటెడ్‌’ పాటకు కంపెనీ స్పాన్సర్‌ చేసింది. ఈ పాట ద్వారా నిధులు సమీకరించి.. కోవిడ్‌–19 సంక్షోభానికి గురైన 2,00,000 కుటుంబాలకు సాయం చేస్తారు. తద్వారా 3,00,000 మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరం కాకుండా ఉంటారన్నది సంస్థ భావన అని డ్యూక్స్‌ ఇండియా ఎండీ రవీందర్‌ అగర్వాల్‌ తెలిపారు. (చ‌ద‌వండి: పీఎం కేర్స్‌ నిధుల మళ్లింపు అనవసరం)

మరిన్ని వార్తలు