ఈ సాక్సులు వేసుకుంటే సినిమా మిస్ అవ్వరు.. ఎలా అంటే?

24 Nov, 2023 18:56 IST|Sakshi

కంప్యూటర్ యుగంలో పెరుగుతున్న టెక్నాలజీని వినియోగదారులకు అనుకూలంగా తయారు చేయడానికి కొన్ని కంపెనీలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే 'నెట్‌ఫ్లిక్స్ సాక్స్‌' పేరుతో అందుబాటులో ఉండే సాక్స్ సినిమాలు చూసేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉండేలా తయారు చేశారు. ఈ అద్భుతమైన సాక్స్ గురించి మరిన్ని వివరాలను ఇక్కడ చూసేద్దాం.

నిజానికి నెట్‌ఫ్లిక్స్ ద్వారా సినిమాలు.. లేదా ఇతర ప్రోగ్రామ్స్ చూసే సమయంలో నిద్ర వస్తే.. ఆ ప్రోగ్రామ్ లేదా సినిమా మిస్ అయిపోతామేమో అని చాలామంది కంగారు పడొచ్చు. కానీ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా చూసేటప్పుడు నిద్ర వస్తే నిద్రపోవచ్చు. మీరు ఏ మాత్రం చూస్తున్న ప్రోగ్రామ్ మిస్ అయ్యే అవకాశం లేదు.

నెట్‌ఫ్లిక్స్ సాక్స్‌ పేరుతో మార్కెట్లో లభించే సాక్సులు సెన్సార్‌లను కలిగి ఉంటాయి, కాబట్టి టీవీ చూసే సమయంలో వాటిని కాళ్ళకు వేసుకోవాలి. సాక్సులు వేసుకుని టీవీ చూసే సమయంలో నిద్ర వస్తే.. సాక్సులోని సెన్సార్లు ఆ విషయాన్ని గుర్తించి.. మీరు చూస్తున్న సినిమాను అక్కడితో ఆపేస్తాయి. మీరు నిద్ర మేల్కొన్న తరువాత ప్రోగ్రామ్ మళ్ళీ అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది.

ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్‌ హ్యాండ్‌ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..

ఈ సాక్సులు మీ కదలికలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు కదలకుండా అలాగే కూర్చుంటే సాక్సులోని సెన్సార్ టీవీని ఆపేయవచ్చు, కాబట్టి సాక్సు వేసుకుని టీవీ చూసేటప్పుడు కదలిక అవసరం. కదలకుండా కూర్చోవడం లేదా నిద్రపోవడం మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ సాక్సులు సమస్యగా మారే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు