రూ.7250 కోట్లు విరాళం ప్రకటించిన వారెన్ బఫెట్ - ఎవరికో తెలుసా?

24 Nov, 2023 17:47 IST|Sakshi

ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'వారెన్ బఫెట్' (Warren Buffett) గతంలోనే తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని వెల్లడించారు. అన్నమాట ప్రకారమే చేస్తున్న బఫెట్ తాజాగా స్వచ్ఛంద సంస్థలకు 876 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్‌లను అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ తమ పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు వేలకోట్లు విరాళాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగానే గత మంగళవారం 876 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7250 కోట్లు) షేర్‌లను గిఫ్ట్‌గా ప్రకటించారు.

ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్‌ హ్యాండ్‌ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..

వారెన్ బఫెట్ భార్య పేరు మీద ఉన్న 'సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్‌'కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్‌లను ప్రకటించారు. తమ పిల్లలు నిర్వహిస్తున్న మూడు ఫౌండేషన్లకు (షేర్‌వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్‌) ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్‌షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చేసారు. గత ఏడాది కూడా భారీ షేర్లను విరాళంగా అందించారు.

మరిన్ని వార్తలు