హౌసింగ్‌ ప్రాజెక్టులకు రూ. 350 కోట్లు:ఎల్డెకో, హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌

17 Sep, 2022 13:33 IST|Sakshi

రూ. 350 కోట్లతో నిధి(ఫండ్‌) ఏర్పాటు

ఎల్డెకో గ్రూపు,  హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ జత  

న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌తో చేతులు కలిపినట్లు రియల్టీ సంస్థ ఎల్డెకో గ్రూప్‌ తాజాగా పేర్కొంది. తద్వారా దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో హౌసింగ్‌ ప్రాజెక్టుల అభివృద్ధిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 350 కోట్లతో నిధి(ఫండ్‌) ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వెరసి అందుబాటు ధరల రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా హెచ్‌-కేర్‌3 పేరుతో రియల్టీ ఫండ్‌కు తెరతీసినట్లు ఎల్డెకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ తెలియజేసింది. (Gold Price: ఫెస్టివ్‌ సీజన్‌లో గుడ్‌ న్యూస్‌)

ప్రస్తుతం ఎల్డెకో గ్రూప్‌ ఢిల్లీ-ఎన్‌సీఆర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో నాలుగు హౌసింగ్‌ ప్రాజెక్టులను గుర్తించింది. వీటిపై రూ. 175 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. కాగా.. ఇంతక్రితం కూడా హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌తో భాగస్వామ్యంలో ఎల్డెకో గ్రూప్‌ హెచ్‌-కేర్‌1 పేరుతో రూ. 150 కోట్ల రియల్టీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. తద్వారా తక్కువ ఎత్తులో, ప్లాటెడ్‌ అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. తొలిగా ఈ ఏడాది మార్చిలో ఎల్డెకో ప్యారడైజో పేరుతో పానిపట్‌లో 35 ఎకరాల ప్లాటెడ్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.  

 (క్లిక్‌: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్‌ కమింగ్‌ సూన్‌)

మరిన్ని వార్తలు