జనవరి నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇవే!

8 Feb, 2023 17:52 IST|Sakshi

దేశీయంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అమ్మకాల్లో గణనీయమైన వృద్దిని సాధించినట్లు తెలుస్తోంది. కేంద్ర రవాణా శాఖకు చెందిన ‘వాహన్‌’ తాజాగా దేశీయంగా అమ్ముడుపోయిన ఈవీ వెహికల్స్‌ సేల్స్‌ జాబితాను విడుదల చేసింది. ఆ నివేదికలో కొన్ని కంపెనీల వాహనాల అమ్మకాలు తగ్గగా.. మరికొన్ని కంపెనీల వాహనాల సేల్స్‌ పెరిగినట్లు తేలింది. 

గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే జనవరి నెలలో ఓలా మినహా ఇస్తే ఇతర ఆటోమొబైల్‌ సంస్థల ఈవీ స్కూటర్‌ సేల్స్‌ వృద్ది సాధించాయి. ఓలా ఎస్‌1ఎయిర్‌, ఓలా ఎస్‌ 1, ఓలా ఎస్‌ 1 ప్రో వెహికల్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. వాటిల్లో నాసిరకంగా తయారీ కారణంగా ముందు టైర్లు ఊడిపోవడంతో అప్రతిష్టను మూటగట్టుకుంది. అయినప్పటకీ జనవరిలో ఓలా 18,245 వెహికల్స్‌ అమ్మింది.   

టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌ 10,404 యూనిట్లను విక్రయించింది. ఆ సంస్థ తొలగిసారి జనవరి 2020న, ఏప్రిల్‌ 2022 న కొత్త ఈవీ స్కూటర్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. జియో - బీపీ భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా ఛార్జింగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ సదుపాయాన్ని వాహన దారులకు అందుబాటులోకి తెచ్చింది. 

ఎథేర్‌ ఎనర్జీ ఇతర ఆటోమొబైల్‌ సంస్థల కంటే ముందుగా ఈవీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 2018 సెప్టెంబర్‌ నెలలో ఎథేర్‌ 450 ఎక్స్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఆ వెహికల్స్‌ అమ్మకాలు కొనసాగుతుండగా డిసెంబర్‌ 2022లో 7,652 వెహికల్స్‌ను జనవరి 2023లో 9,139 వెహికల్స్‌ రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. 

ఇక హీరో ఎలక్ట్రిక్‌ డిసెంబర్‌ నెలలో 8 వేల వాహనాల్ని విక్రయించగా.. ఆ సంఖ్య భారీగా తగ్గి జనవరి నెలలో 6,393 వెహికల్స్‌ అమ్మినట్లు నివేదిక హైలెట్‌ చేసింది. 

హీరో ఎలక్ట్రిక్‌ తర్వాత ఒకినావా సేల్స్‌ సైతం తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్‌లో 875  వెహికల్స్‌ను విక్రయించగా జనవరిలో 4,404ను అమ్మింది. అయితే కంపెనీ ఊహించని విధంగా సేల్స్‌ జరగలేదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఆంపియర్ సంస్థ ప్రిమస్‌, మ్యాగ్నస్‌ ఈఎక్స్‌, రియో ప్లస్‌ పేరుతో మూడు వెహికల్స్‌ ఈ ఏడాది జనవరిలో పరిచయం చేసింది. అదే నెలలో 4,366 వెహికల్స్‌ను అమ్మింది. 

ఇతర కంపెనీలతో పోలిస్తే 2,615 చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అమ్ముడు పోయాయి. 

మరిన్ని వార్తలు