షాకింగ్‌ రిపోర్ట్‌: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్‌ మస్క్‌

1 Sep, 2022 13:06 IST|Sakshi

పదింటిలో  ఎనిమిది ట్విటర్‌  ఖాతాలు నకిలీవే: సెక్యూరిటీ నిపుణుడు

 ట్విటర్‌పై మస్క్‌ ఎటాక్‌

న్యూఢిల్లీ: వరల్డ్‌ బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌పై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టాడు. ట్విటర్‌లో 5 శాతానికిపైగా నకిలీ ఖాతాలు ఉన్నాయన్న విషయాన్ని  నిరూపించేదాకా వదల..వదల బొమ్మాళీ అన్నంత పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా తన అభిప్రాయానికి బలాన్నిచ్చే కథనాన్ని ట్విట్‌ చేశారు టెస్లా బాస్‌.  

ఇది చదవండి: SpiceJet: భారీ నష్టాలు,సీఎఫ్‌వో గుడ్‌బై, కుప్పకూలిన షేర్లు

పదింటిలో ఎనిమిది ట్విటర్ ఖాతాలు నకిలీవే అన్న టాప్‌ మోస్ట్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ వాదనను ఉటంకిస్తూ ట్వీట్‌ చేశారు. ఖచ్చితంగా నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతానికంటే ఎక్కువే అ‍ంటూ ట్విటర్‌ను ఎద్దేవా చేశారు. యుఎస్ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్‌లతో 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన సైబర్‌సెక్యూరిటీ కంపెనీ ఎఫ్-5  గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డాన్ వుడ్స్ 80 శాతానికి పైగా ట్విటర్ ఖాతాలు నకిలీవి కావచ్చని ది ఆస్ట్రేలియన్‌తో అన్నారు. డార్క్ వెబ్‌లో నకిలీ  ఫాలోవర్స్‌ను కొనుగోలు చేస్తున్నారని కూడా వుడ్స్‌ పేర్కొన్నారు.  అలాగే ఎలాన్‌ మస్క్, ట్విటర్  రెండూ కంపెనీ ఈ సమస్యను తక్కువగా అంచనా వేసినట్లు చెప్పారు.

(ఇదీ చూడండి: SC On Check Bounce Case: చెక్‌ బౌన్స్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు)

కాగా నకిలీ ఖాతాల విషయంలో ట్విటర్‌ తప్పుదారి పట్టించిందని  ఆరోపించిన మస్క్‌..  వీటి  లెక్కలు తేలాల్సిందే అని డిమాండ్‌ చేస్తూ 44 బిలియన్‌ డాలర్ల ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి గత జూలైలో తప్పుకున్న సంగతి తెలిసిందే.  ఈ వ్యవహారం ట్విటర్‌, మస్క్‌  మధ్య న్యాయపోరాటానికి తీసింది. ఇపుడు ఈ వివాదం కోర్టుకు చేరింది.

మరిన్ని వార్తలు