ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌సేల్‌: భారీగా ఆఫర్లు

2 May, 2021 16:41 IST|Sakshi

స్వదేశీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ పేరుతో మరో సారి వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ మే 2 నుంచి మే 7 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌ లో భాగంగా ఆపిల్, శామ్‌సంగ్, షియోమీ, రియల్-మీ వంటి సంస్థల వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ తీసుకువచ్చింది. టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ మరిన్ని ఇతర ఉత్పత్తులపై కూడా మంచి ఒప్పందాలు, ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కస్టమర్లు 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు.

గూగుల్ ప్రముఖ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 4ఎ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ 15 శాతం తగ్గింపుతో లభిస్తుంది. దాని అసలు ధర రూ.31,999 కాగా ప్రస్తుతం ఆఫర్ కింద ధర రూ.26,999 లభిస్తుంది. శామ్ సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ పై బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రూ. 2 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఈ ఫోన్ 6GB + 64GB వేరియంట్ వాస్తవ ధర రూ. 14,999 కాగా, రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. మైక్రో మాక్స్ ఇన్ 1 మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ను కేవలం రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఈ పోన్ పై ఇంత వరకు ఎలాంటి తగ్గింపును ప్రకటించలేదు. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.1 అంగుళాల ఎల్‌సీడీ రెటీనా డిస్‌ప్లే కలిగిన ఆపిల్ ఐఫోన్ 11 రూ.7,000 తగ్గింపుతో మీకు రూ.44,999 నుండి లభిస్తుంది.

చదవండి: 

కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు