ఫిబ్రవరిలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు వెల్లువ 

22 Feb, 2021 20:36 IST|Sakshi

భారత మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌ఐఐ) ఫిబ్రవరిలో ఇప్పటి వరకు రూ.24,965 కోట్లు పెట్టుబడి పెట్టారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ పై ఆశావాదం, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం  వంటి కారణంగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. డిపాజిటరీస్‌ డేటా గణాంకాల ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌పిఐ) భారతీయ ఈక్విటీల్లోకి రూ.24,204 కోట్లు, రుణ విభాగంలోకి రూ.761 కోట్లు పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది. గత నెలలో ఎఫ్‌పిఐలు ద్వారా నికరంగా రూ.14,649 కోట్లు భారత్‌కు వచ్చాయి.

2021లో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసినందున ఎఫ్‌పిఐలు భారత మార్కెట్లపై సానుకూలంగా ఉన్నాయని ఎల్‌కెపి సెక్యూరిటీల పరిశోధన విభాగాధిపతి ఎస్. రంగనాథన్ తెలిపారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటు అంచనాలపై సానుకూలంగా ఉండడంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్నాయని గ్రో సంస్థ సీవోవో హర్ష జైన్‌ తెలిపారు. ఒక అంతర్జాతీయ ఏజెన్సీ భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 2022లో 11.5 శాతంగా ఉంటుంది అని అంచనా వేసింది. గతంలో పేర్కొన్న8.8 శాతం వృద్ధి రేటు అంచనాను సవరించింది. దీనితో కరోనావైరస్ మహమ్మారి మధ్య రెండంకెల వృద్ధిని నమోదు చేసిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశం నిలవనుంది.

చదవండి: 

పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు!

మరిన్ని వార్తలు