వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె

22 Apr, 2023 18:13 IST|Sakshi

ప్రిస్టిన్ కేర్ కో ఫౌండర్ డాక్టర్ 'గరిమా సాహ్నీ' గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వైద్య వృత్తిలో కోట్లు గడిస్తున్న ఈమె 800 పైగా ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఎంతో మంది రోగులకు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్న సాహ్నీ సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గైనకాలజీ విభాగంలో ఉత్తమ వైద్యురాలుగా, మృదుభాషిగా పేరుపొందిన గరిమా సాహ్నీ వైద్య వృత్తిలోనే కొత్త సొగసులకు శ్రీకారం చుట్టింది. హాస్పిటల్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ప్రిస్టిన్ కేర్ అనే క్లినిక్‌ ప్రారంభించి ఏడాదికి 1.4 బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.11400 కోట్లు.

డాక్టర్ గరిమ, ఆమె స్నేహితుడు డాక్టర్ వైభవ్, అతని చిన్ననాటి స్నేహితుడు హర్సిమర్బీర్ సింగ్ క్లినిక్‌ని ఎలా విస్తరించాలనే దానిపై నిరంతరం కృషి చేసి ఎలక్టివ్ సర్జరీ రంగాన్ని ఎంచుకుని నాణ్యమైన వైద్యం అందించడం ప్రారంభించారు. వైద్యంలో మౌలిక సదుపాయాలు అందించడానికి, అదే సమయంలో రోగులకు చికిత్స అందించడానికి వారి ఖాళీ స్థలాన్ని ఉపయోగించాలనుకున్నారు. ప్రస్తుతం 42 నగరాల్లో సుమారు 1.5 మిలియన్ల మంది రోగులు సేవ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు - మహీంద్రా బొలెరో నుంచి టాటా నెక్సాన్ వరకు..)

డాక్టర్ సాహ్నీ ఆమె కుటుంబంలో మొదటి వైద్యురాలు. ఆమె తండ్రి సలహా మేరకు గైనకాలజీని ఎంచుకుంది. ఈమె డాక్టర్ వైభవ్‌ను వివాహం చేసుకుంది. ప్రిస్టిన్ కేర్ ప్రస్తుతం 800 పైగా ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇందులో దాదాపు అత్యాధునిక పరికరాల అందుబాటులో ఉంటాయి. 

(ఇదీ చదవండి: BIS Care App: మీరు కొనే బంగారం స్వచ్ఛమైనదా.. కాదా? ఈ యాప్ ద్వారా తెలుసుకోండి!)

ప్రిస్టిన్ కేర్ అతి తక్కువ కాలంలోనే విజయవంతమైంది, 2022 ఆర్థిక సంవత్సరంలో వీరు రూ. 350 కోట్లకంటే ఎక్కువ ఆదాయాన్ని పొందారు. ఈ ఏడాది వారి సంపాదన సుమారు రూ. 1000 కోట్లు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి డాక్టర్ వృత్తిలో ఉంటూ బిలీనియర్స్ అయ్యారు.

మరిన్ని వార్తలు