మీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు జాగ్రత్త.. పోగొట్టుకుంటే మళ్లీ కష్టమే!

26 Jun, 2021 20:06 IST|Sakshi

మీకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు బ్యాంకుల నుంచి రావాలంటే ఎంత సమయం పడుతుంది... డెబిట్‌ కార్డు కోసమైతే..రెండు లేదా మూడు రోజులు పట్టొచ్చు. కొన్ని బ్యాంకులయితే వెంటనే అకౌంట్‌ తీసిన రోజే డెబిట్‌ కార్డును జారీ చేస్తాయి. క్రెడిట్‌ కార్డు కోసమైతే.. అన్ని వెరిఫీకేషన్‌లు పూరైన వెంటనే బ్యాంకులు కార్డును జారీ చేస్తాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు పోతే బ్లాక్‌ చేసి రెండు, మూడురోజుల్లో బ్యాంకులనుంచి తిరిగి సులువుగా పొందవచ్చుననీ అనుకుంటున్నారా..! భవిష్యత్తులో అలా కుదరదు.

తీవ్ర చిప్స్‌ కొరతతో కార్డుల ఉత్పత్తికి ఆటంకం..!
రానున్న రోజుల్లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చును అసలు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఇవ్వకపోవచ్చును. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్‌ కొరతతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుందని వ్యాపార నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3 బిలియన్ల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను కంపెనీలు తయారుచేస్తున్నాయి. సుమారు 90 శాతం మేర నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి కార్డులను తయారుచేసే కంపెనీలు ప్రస్తుతం తీవ్ర చిప్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థ , మొబైల్ చెల్లింపుల సంస్థలు చిప్‌ల కొరతను నివారించడానికి, సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కోవిడ్‌ తెచ్చినా తంటాలు...!
కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం  చిప్ తయారీదారులు కార్యకలాపాలను పూర్తిగా మూసివేయవలసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చిప్స్‌ కొరత ఏర్పడింది. చిప్స్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల కోసం ఆకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. చిప్స్‌ కొరత  ఏర్పడడంతో సెమీకండక్టర్‌ పరిశ్రమ దెబ్బతింది. చిప్స్‌ కొరతతో పలు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి.

ప్రస్తుతం నెలకొన్న ఈఎంవీ చిప్స్‌ కొరతతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ఉత్తత్తికిభారం కానుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల జారీకి ఆటంకం ఏర్పడునుందని ట్రేడ్‌ యూనియన్‌ తెలిపింది. కాగా ప్రస్తుతం చిప్స్‌ కొరత 2022 సంవత్సరం వరకు కొనసాగనుందని  చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థలు , మొబైల్ చెల్లింపుల సంస్థలు పేర్కొన్నాయి. సో ప్రస్తుతం ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడపడితే అక్కడే పొగ్గొట్టుకున్నారో ఇక అంతే సంగతులు.

చదవండి: Debit Card EMI: మీకు అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి..?

మరిన్ని వార్తలు