Today Gold And Silver Prices: బంగారం తగ్గినా, వెండి మాత్రం తగ్గేదేలే.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

21 Dec, 2023 14:28 IST|Sakshi

గత కొన్ని రోజులుగా పడుతూ.. లేస్తూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు పలు రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 57750 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 63000గా ఉంది. నిన్న రూ. 350 నుంచి రూ. 380 వరకు పెరిగిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చెన్నైలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5825 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6355గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58250, రూ. 63550గా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు రూ. 100 తగ్గినట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: బాలీవుడ్‌ రిచ్‌ మ్యాన్‌.. స్టార్‌ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ!

తెలుగు రాష్ట్రాల మాదిరిగానే దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. నేడు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5790 కాగా, 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 6315గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 57900, రూ. 63150గా ఉంది.

వెండి ధరలు
గతం రెండు మూడడు రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గేదేలే అన్నట్లు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న రూ. 1000 పెరిగిన వెండి ధరలు ఈ రోజు కూడా రూ. 700 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో నేడు కేజీ వెండి ధరలు దాదాపు రూ. 80,000 దాటేసినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు