కన్సాలిడేషన్‌లో.. బంగారం- వెండి

19 Oct, 2020 10:19 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,469కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 61,330 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1904 డాలర్లకు

24.30 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి  

వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో స్వల్ప నష్టాలతో ముగిసిన బంగారం, వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి.  కన్సాలిడేషన్‌ బాటలో అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం  రూ. 78 క్షీణించి రూ. 50,469 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 346 నష్టంతో రూ. 61,330 వద్ద కదులుతోంది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు పుంజుకోవడం, అమెరికా ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితులు వంటి అంశాలు పసిడి ధరలకు చెక్‌ పెడుతున్న విషయం విదితమే. సెప్టెంబర్‌లో యూఎస్‌ రిటైల్‌ సేల్స్‌ అంచనాలను మించుతూ 1.9 శాతం వృద్ధి చూపడంతో వారాంతాన పసిడి బలహీనపడినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరగడం ఆర్థిక రికవరీకి సంకేతమని విశ్లేషకులు తెలియజేశారు.

శుక్రవారమిలా
ఎంసీఎక్స్‌లో వారాంతాన 10 గ్రాముల పసిడి రూ. 160 నష్టంతో రూ. 50,552 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,813 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,452 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. అయితే వెండి కేజీ రూ. 118 బలపడి రూ. 61,653వద్ద నిలిచింది. ఒక దశలో 62,170 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 61,324 వరకూ క్షీణించింది. దేశీయంగా ఆగస్ట్ 7న పసిడి రూ. 56,200 వద్ద, వెండి రూ. 80,000 సమీపంలోనూ రికార్డ్‌ గరిష్టాలకు చేరిన విషయం విదితమే.

కామెక్స్‌లో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.1 శాతం నీరసించి 1,904 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1901 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి 0.5 శాతం నష్టంతో ఔన్స్ 24.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

వారాంతాన
వారాంతాన న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 0.15 శాతం నీరసించి 1,906 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్‌ మార్కెట్లో 0.5  శాతం క్షీణించి 1,899 డాలర్లకు చేరింది. అయితే వెండి మాత్రం 0.75 శాతం ఎగసి ఔన్స్ 24.41 డాలర్ల వద్ద స్థిరపడింది. వెరసి పసిడి ధరలు గత వారం 1 శాతం నష్టాలతో నిలిచినట్లు నిపుణులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు