సీఎస్‌ఆర్‌ నిబంధనలకు సవరణ.. నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోతే

24 Sep, 2022 09:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) ఖాతాల్లో ఖర్చు చేయకుండా నిధులు మిగిలిపోతే వాటి వినియోగానికి సంబంధించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు నిబంధనలను సవరించింది. సాధారణంగా నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తాము సీఎస్‌ఆర్‌ కింద చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తి కాని సందర్భంలో, దానికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోతే ఆ మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

తాజా సవరణ ప్రకారం ఆయా నిధులు సదరు ఖాతాల్లో ఉన్నంత వరకూ వాటి పర్యవేక్షణ కోసం కంపెనీలు సీఎస్‌ఆర్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే బోర్డు నివేదికలో పొందుపర్చాల్సిన సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల వార్షిక రిపోర్టు ఫార్మాట్‌నూ ప్రభుత్వం సవరించింది.

చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! 

మరిన్ని వార్తలు