ఇక సోషల్ మీడియా నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయా?

5 Feb, 2022 15:44 IST|Sakshi

ఒకప్పుడు ఏదైనా వార్త దూర ప్రాంతంలో ఉండేవారికి చేరాలంటే కొన్ని రోజల సమయం పట్టేది… నేటి సోషల్ మీడియా వలన క్షణాలలో వార్త ప్రపంచం మొత్తం చేరుకుంటుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి కుదించేసింది.. అరచేతిలోనే ప్రపంచంలో ఏమూలా ఏం జరిగినా తెలుసుకోవచ్చును. అయితే, ఇలాంటి సోషల్ మీడియాలో వాస్తవ సమాచారం కంటే నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నకిలీ వార్తలను అరికట్టడంలో ఆయా కంపెనీలు విఫలం కావడంతో అనేక దేశాల ప్రభుత్వాలు సోషల్ మీడియా కంపెనీల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పుడు, మన దేశం కూడా భారతదేశంలో పనిచేస్తున్న అన్ని మైక్రో బ్లాగింగ్ కంపెనీలలో మరింత జవాబుదారీ తనం తీసుకొని రావడానికి సోషల్ మీడియా నిబంధనలను కఠినతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ..మరింత జవాబుదారీ తనంగా సోషల్ మీడియా కంపెనీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడటంలో రాజీ పడబోమని ఆయన పేర్కొన్నారు. 

ఈ విషయంలో "బుల్లి బాయి", "** డీల్స్" యాప్స్ మీద కేంద్ర ప్రభుత్వం "తక్షణ చర్య" తీసుకున్నట్లు మంత్రి వైష్నావ్ పేర్కొన్నారు. మతం/ప్రాంతంతో సంబంధం లేకుండా మహిళల గౌరవాన్ని రక్షించడం ప్రభుత్వానికి "ప్రాథమిక భాద్యత" అని ఆయన పేర్కొన్నారు. "మేము సోషల్ మీడియాను నియంత్రించడానికి చర్యలు తీసుకున్నప్పుడల్లా, ప్రతిపక్షాలు వాక్ స్వాతంత్ర్యంపై దాడి చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి, ఇది నిజం కాదు.. మేము సమతుల్యతను సాధించాలి అని చూస్తున్నట్లు" వైష్నావ్ అన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఐ-ఎం నాయకుడు ఝార్నా దాస్ బైద్యకు మంత్రి సమాధానమిస్తూ.. "సభ ఏకాభిప్రాయానికి వస్తే, మేము మరింత కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు. "ఈ సమయంలో, మేము రాజ్యాంగ బద్దంగా పనిచేస్తున్నాము. కానీ అవును, ముందుకు వెళ్తే మేము సోషల్ మీడియాను మరింత జవాబుదారీగా చేయాలి" సోషల్ మీడియా వేదికల కోసం ప్రభుత్వం ఏవైనా నిబంధనలు లేదా మార్గదర్శకాలను రూపొందించిందా అనే బైద్య ప్రశ్నకు ప్రతిస్పందించాలని వైష్నావ్ పేర్కొన్నారు.

(చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు షాక్..!)

మరిన్ని వార్తలు