Multibagger Stock: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు

20 Oct, 2021 15:58 IST|Sakshi

మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌. స్టాక్‌ మార్కెట్‌లో మనం తరుచూ వినే పదం. ఈ స్టాక్స్‌లో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాల్ని గడించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే లక్షాది కారులు కాస్తా కోటీశ్వరులు కావొచ్చు. మంచి కంపెనీ. పెద్దగా పబ్లిసిటీ ఉండదు. కానీ ఇలాంటి కంపెనీలు రోజులు గడిచే కొద్ది ఇన్వెస్టర్లకు లాభాల పంట పడిస్తాయి. అయితే ఇందుకోసం స్టాక్‌మార్కెట్‌పై ఖచ్చితమైన అవగాహన, ఓపిక చాలా అవసరం. అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే భారీగా నష్టాల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్స్‌
ఇక మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌లో ఒకటిగా ఉన్న హెచ్ డీఎఫ్‌సీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన  ముదుపర్లు భారీ లాభాల్ని మూటగట్టుకున్నారు. ఈ షేరు  భారీ లాభాన్ని అర్జించిందిగత ఆరు నెలల కాలంలో 20 శాతం పెరుగుదలతో షేరు ధర రూ.1412 నుంచి రూ.1680 స్థాయికి చేరింది. ముఖ్యంగా మార్కెట్ లో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ ధర సింగిల్‌ డిజిట్‌లో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టిన ముదుపర్లు ఇప్పుడు కోట్లు గడిస్తున్నారు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ వ్యాల్యూ

నెలల వ్యవధిలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ వ్యాల్యూ పెరగడం పెట్టుబడిదారులకు వరంగా మారింది. నెల ముందు ఈ షేర్‌ రూ.1559 ఉండగా అనుహ్యంగా 8శాతం రిటర్న్‌తో  రూ.1680 పెరిగింది. 

ఇక ఆరు నెలల క్రితం ఇదే షేర్‌ వ్యాల్యూ రూ.1412 నుంచి 20శాతం పెరిగి రూ.1680కి చేరింది.

సంవత్సరం క్రితం రూ.1200 ఉండగా 40శాతం పెరిగి రూ.1680కి చేరింది. 

► అదే గత 5 ఏళ్ల క్రితం బ్యాంక్‌ షేర్‌ రూ.635 ఉండగా 165శాతం పెరిగి రూ.1680కి చేరింది. 

► 22ఏళ్ల క్రితం అంటే అక్టోబర్‌ 15,1999లో షేర్‌ ప్రైస్‌ రూ.9.82 ఉండగా  ఈ వారానికి ఆ ధర రూ.1680కి చేరింది. 

ఏ సంవత్సరం లో ఎంత పెట్టుబడి పెడితే 
ఉదాహరణకు మల్టీ బ్యాగర్స్‌ స్టాక్స్‌గా పేరొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే .. ఇప్పుడు ఆ లక్ష కాస్త రూ.2.65 లక్షల లాభాల్ని అర్జించింది.ఇక పెట్టుబడులు పెట్టి చేతులు దులిపేసుకోకుండా కొన్ని సంవత్సరాల పాటు అలాగే నిరీక్షించిన ఇన్వెస్టర్లు ఎంత లాభమో ఈ షేర్‌ వ్యాల్యూని చూస్తే అర్ధం అవుతుంది. సరిగ్గా ఇదే అక్టోబర్‌ నెలలో 22ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడితో  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక్క షేర్‌ వ్యాల్యూ రూ.9.82ఉన్నప్పుడు కొనుగోలు చేసి అలాగే ఉంచినట్లైతే.. ఈ వారంలో ఆ షేర్‌ వ్యాల్యూ ధర ఎంతంటే అక్షరాల రూ.కోటీ 70 లక్షలు. 22ఏళ్ల క్రితం లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ.1 కోటీ 70లక్షలకు చేరింది.

చదవండి: ఇవి షేర్లా.. బుల్లెట్‌ రైళ్లా... లాభాలతో ఇన్వెస్టర్ల ఉక్కిరి బిక్కిరి

మరిన్ని వార్తలు