అమ్మకాల్లో దూసుకెళ్తున్న హీరో ఎలక్ట్రిక్!

9 Aug, 2021 17:25 IST|Sakshi

భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ హీరో ఎలక్ట్రిక్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15,000కు పైగా హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అమ్మినట్లు ప్రకటించింది. భారతదేశంలోని ఏ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనా కంపెనీ కూడా దీనికి దగ్గరలో లేదు. జెఎంకె నివేదిక ప్రకారం.. జూలై నెలలో 4,500కు పైగా హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో కంపెనీ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు సంవత్సరానికి 3 లక్షల ఈవీలను తయారు చేయడానికి భారీగా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తుండటంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాలనాలకు డిమాండ్ పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లు ఆప్టిమా, నైక్స్ ధరలు రూ.53,600 ప్రారంభం కావడంతో డిమాండ్ మరింత పెరిగినట్లు హీరో సంస్థ భావిస్తుంది. గత నెలల్లో కంపెనీ గణనీయమైన సంఖ్యలో బుకింగ్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అధిక డిమాండ్ గురించి హీరో ఎలక్ట్రిక్ డీలర్ శ్రీ రాజేష్ జడం మాట్లాడుతూ.. "జూన్ 11 తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 10 రేట్లకు పైగా పెరిగింది. మేము దాదాపు 8 సంవత్సరాలుగా హీరో ఎలక్ట్రిక్ డీలర్లుగా ఉన్నాము. జూలై నెలలో మాకు భారీగా బుకింగ్స్ కోసం ఎక్కువగా ఎంక్వైరీలు వచ్చినట్లు" అని పేర్కొన్నారు. "హీరో స్కూటర్ల ధరలు ఇప్పుడు రూ.70,000 కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఇది చాలా తక్కువ, వినియోగదారులు టెస్ట్ రైడింగ్ చేసిన వెంటనే వాటిని బుక్ చేస్తున్నారు. సుమారు 90% స్కూటర్లు బుక్ చేశారు" అని డీలర్ అన్నారు.

మరిన్ని వార్తలు