దిగ్గజాలకు వణుకుపుట్టిస్తున్న హోండా మోటార్‌సైకిల్ మాస్టర్ ప్లాన్

25 Mar, 2023 12:49 IST|Sakshi

భారతదేశంలో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరు పొందిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో ఏకంగా పది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందిస్తోంది.

నివేదికల ప్రకారం.. మల్టిపుల్ పవర్‌ట్రెయిన్స్, స్పీడ్ కేటగిరి, బాడీ టైప్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని కంపెనీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. సుమారు రెండు సంవత్సరాల తరువాత కంపెనీ ఈ ప్లాన్ సిద్ధం చేసింది.

(ఇదీ చదవండి: సైడ్‌ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న హీరోయిన్లు వీళ్లే!)

2024 నాటికి దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ పాపులర్ స్కూటర్ హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఉనికిని చాటుకోవడానికి హోండా చేయవలసిన అన్ని ప్రయత్నాలను నిర్విరామంగా చేస్తోంది.

(ఇదీ చదవండి: హయ్యర్ స్టడీస్ లోన్‌పై బ్యాంకు విధించే చార్జెస్, ఇవే!)

2024లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ విడుదలైన తరువాత మరో టూ వీలర్ కూడా లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే ఏడాదిలో కంపెనీ రెండు ఈవీ మోడల్స్ విడుదల చేయనున్నట్లు స్పష్టమైంది. ఆ తరువాత 2026-27 మధ్యలో మరికొన్ని మోడల్స్ విడుదల చేయాలనీ సంస్థ యోచిస్తోంది. మొత్తం మీద కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తప్పకుండా మంచి అభివృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నాము.

మరిన్ని వార్తలు