NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్.. ఇలా అప్లై చేసుకోండి!

17 Mar, 2023 08:40 IST|Sakshi

ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి

ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి

ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి

ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికి తెలుసు. దేశంలో ఉన్న ప్రజలందరూ దాదాపు ఆధార్ కార్డు, ఆదాయ పన్ను చెల్లించేవారు పాన్ కార్డు కలిగి ఉంటారు. అయితే కేవలం భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రవాస భారతీయులు (NRI) కూడా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. 

పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) అనేది నెంబర్స్, ఇంగ్లీష్ అక్షరాలతో కలిసి ఉంటుంది. మనదేశంలోని  ఆదాయ పన్ను శాఖ ఈ పాన్ నెంబ‌ర్‌తో కూడిన కార్డును జారీ చేస్తుంది. ఇండియాలో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉండాలి. పాన్ కార్డు కోసం ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ తెలుసుకోవచ్చు..

ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి

 • భారతదేశంలో ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వారు.
 • భారతదేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారు.
 • స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనునుకునే వారు.
 • మ్యుచ్చువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి చూపే వారు.

ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం

 • UTIITSL లేదా Proteanలో అప్లై ఆన్‌లైన్‌ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
 • అప్లికేషన్ టైప్ కింద ఫామ్ 49ఏ ఫర్ ఎన్ఆర్ఐ సెలెక్ట్ చేసుకోవాలి. 
 • విదేశీ పౌరసత్వం ఉన్నవారైతే ఫామ్ 49ఏఏ సెలెక్ట్ చేసుకోవాలి.
 • అందులో అన్ని వివరాలను నింపిన తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
 • సబ్మిట్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
 • ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసిన అవసరమైన డాక్యుమెంట్స్, డిజిటల్ సిగ్నేచర్ వంటివి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
 • తరువాత ఓపెన్ అయ్యే పేమెంట్ పేజీలో అమౌంట్ పే చేసిన తరువాత అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవడం

 • ఆన్‌లైన్‌ విధానం గురించి అవగాహన లేనివారు, ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
 • ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలనుకునేవారు సమీపంలో ఉన్న ఐటి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిఐఎన్ ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శించాలి. 
 • అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, ఫీజు చెల్లించి అక్కడే సబ్మిట్ చేయాలి.
 • డీడీ ద్వారా కూడా చెల్లించాల్సిన ఫీజు చెల్లించవచ్చు.
 • ఫీజు చెల్లించిన తరువాత వారు ఇచ్చే అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ని పాన్ కార్డ్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మరిన్ని వార్తలు