వాట్సాప్‌లో యూపీఐ పిన్‌ మార్చడం ఎలానో తెలుసా..?

6 Jan, 2022 21:25 IST|Sakshi

తన ప్లాట్ ఫారంలోని వినియోగదారులకు అంతరాయం లేని అనుభవాన్ని అందించడానికి వాట్సప్ యూపీఐ సేవలను కూడా అందిస్తుంది. ఈ యూపీఐ సేవల వల్ల వాట్సాప్‌ యాప్ నుంచి ఇతరులకు నేరుగా డబ్బును బదిలీ చేయవచ్చు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ 2018లో భారతదేశంలో ఈ ఫీచర్ ట్రయల్ రన్ చేసింది. ఆ తరువాత 2020లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ) ఆమోదం తర్వాత విడుదల చేసింది. ఈ యాప్ 227కు పైగా బ్యాంకుల సేవలను అందిస్తుంది. యూజర్లు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. అలాగే, యుపీఐ పిన్ కూడా మార్చవచ్చు. 

వాట్సాప్‌లో యూపీఐ పిన్‌ ఎలా మార్చాలి..?

  • మొదట స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత ఎగువ కుడివైపున ఉన్న మూడు చుక్కల ఐకాన్ మీద ప్రెస్ చేసి పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఈ పేమెంట్స్ సెక్షన్ కింద యూపీఐ పిన్‌ నెంబరు మార్చాలనుకుంటున్న బ్యాంకు అకౌంట్ మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత Change UPI PIN మీద క్లిక్ చేయండి.
  • ఇప్పటికే ఉన్న యూపీఐ పిన్‌ ఎంటర్ చేసి ఆ తర్వాత కొత్త యూపీఐ పిన్‌ ఎంటర్ చేయండి.
  • చివరిగా పిన్‌ను కన్ఫామ్‌ చేస్తే సరిపోతుంది. మీ పిన్‌ చేంజ్ అవుతుంది.

(చదవండి: కొత్త ఏడాదిలో భారీగా పడిపోతున్న బంగారం ధర..!) 

>
మరిన్ని వార్తలు