పీఎఫ్ విత్ డ్రాపై ట్యాక్స్ మినహాయింపు పొందడం ఎలా?

19 Jul, 2021 15:28 IST|Sakshi

Tax On EPF Withdrawl: కరోనా వైరస్ మహమ్మారి వల్ల సామాన్య ప్రజానీకం సేవింగ్స్ కోసం దాచుకున్న నగదును మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా మారింది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నారు. సాదారణంగా అయితే, పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే కొన్ని సందర్భాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక ఈపీఎఫ్ ఖాతాదారులు చిక్కుల్లో పడుతున్నారు.

ఇతర కారణాల చేత ఐదేళ్ల సర్వీస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డబ్బులు డ్రా చేస్తే పన్నులు చెల్లించాలి. విత్‌డ్రా చేసే మొత్తం రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే సెక్షన్ 192ఏ ప్రకారం 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అంతకన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే 30 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రూ.30,000 కన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ ఉండదు. ఐదేళ్ల సర్వీస్ దాటితే ఎలాంటి పన్నులు ఉండవు. ఇక ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 నాల్గవ షెడ్యూల్ రూల్ 8 సెక్షన్ 10(12) ప్రకారం.. ఒక వ్యక్తి తన ఉద్యోగం మానేసిన తేదీ నాటికి ముందు అతను ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసినట్లయితే విత్ డ్రా చేసే నగదుపై పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.

5 ఏళ్లు పైగా పని చేసి ఉండాలి
అలాగే ఒక వ్యక్తి ఒక కంపెనీలో 2 ఏళ్లు పనిచేసి తర్వాత మరో కంపెనీలో 3 ఏళ్లు పైగా పనిచేస్తే ఇటువంటి సందర్భంలో కూడా తను ఉపసంహరించే నగదుపై పన్ను వర్తిస్తుంది. కానీ, అతను మొదటి సంస్థలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న పీఎఫ్ ఖాతాను, మరో సంస్థలో జాయిన్ అయినప్పుడు పూర్వ పీఎఫ్ ఖాతాను కొత్త పీఎఫ్ కొత్త లింకు చేయడం వల్ల అతను 5 ఏళ్లకు పైగా పనిచేసినట్లు పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సందర్భంలో కూడా అతను పూర్తి సర్విస్ పీరియడ్ కనుక 5 ఏళ్లు కంటే తక్కువగా ఉంటే కచ్చితంగా తను ఉపసంహరించే నగదుపై పన్ను పడుతుంది. కరోనా మహమ్మరి కాలంలో కాకుండా సాధారణంగా నగదు డ్రా చేసినప్పుడు పన్ను నుంచి మినహాయింపు పొందాలంటే కచ్చితంగా 5 ఏళ్లు పని చేసి అయిన ఉండాలి లేదా గత కంపెనీలో పనిచేసిన సర్వీస్ పీరియడ్ అయిన 5 ఏళ్లు పైగా అయిన  ఉండాలి.


 

మరిన్ని వార్తలు