ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్​న్యూస్..!

14 Dec, 2021 16:13 IST|Sakshi

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్​ఐసీ) పెన్షనర్లకు శుభవార్త​ చెప్పింది. వ్యక్తిగత పెన్షన్ ప్లాన్(ఐపీపీ) యాన్యుటర్లు, ఎల్​ఐసీ సిబ్బంది పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్లను ఇక నుంచి ఆన్​లైన్​లోనే పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయడం కోసం ఎల్​ఐసీ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎల్​ఐసీ జీవన్ సాక్ష్య అనే మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా తేలికగా ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయవచ్చు అని తెలిపింది.

సకాలంలో పెన్షన్ పొందడానికి పెన్షనర్లు ప్రతి ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి సులభంగా ఈ యాప్ ద్వారా సులభంగా పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని వినివగించడం కోసం పెన్షన్ పాలసీదారులు మీ ఆధార్  ఆధార్ నెంబరుని మొబైల్ నెంబరుకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఎల్​ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

జీవన్ సాక్ష్య యాప్‌ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇలా పొందండి:

  • మొదట ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి
  • ఆ తర్వాత ఆన్​లైన్​లో మీ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. 
  • ఇప్పుడు మీరు మీ మొబైల్ ద్వారా ఒక సెల్ఫీ దిగి సబ్మిట్ చేయండి. 
  • వెంటనే మీ ఆధార్​ లింక్​ చేసిన మొబైల్​ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్​ చేసి వెరిఫికేషన్​ పూర్తి చేయండి. 
  • ఆ తర్వాత మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్​ను డౌన్​లోడ్​ చేసుకోండి.

"ఫెసిలిటేటర్" ఆప్షన్​ ద్వారా కూడా మీ లైఫ్​ సర్టిఫికెట్​ను పొందవచ్చు. యాన్యుయిటెంట్లు/స్టాఫ్ పెన్షనర్లు కాకుండా వారి కుటుంబ సభ్యులు ఈ ఆప్షన్​ ద్వారా లైఫ్​ సర్టిఫికెట్​ పొందవచ్చు.

ఫెసిలిటేటర్ ద్వారా మీ లైఫ్​ సర్టిఫికెట్ ఇలా పొందండి:

  • ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌లో ఫెసిలిటేటర్ సమాచారాన్ని నమోదు చేయండి.
  • ఆ తర్వాత యాన్యుటెంట్/పెన్షనర్ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. 
  • ఇప్పుడు యాన్యుటెంట్/పెన్షనర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటిపిని వెరిఫై చేయండి. 
  • యాన్యుటెంట్/పెన్షనర్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ తీసి సబ్మిట్ చేయండి. 

ఇటీవల ఒక ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి గడువును పొడిగించింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గడువును ఇప్పుడు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు.

(చదవండి: 5జీ మొబైల్స్‌.. ఈ ఫీచర్స్‌తో ఈ మోడలే చాలా చీప్‌ అంట!)

మరిన్ని వార్తలు