Retrieve Aadhaar card: ఆధార్‌ కార్డ్‌ పోయిందా.. నంబర్‌ కూడా గుర్తులేదా.. ఎలా మరి?

16 May, 2023 20:17 IST|Sakshi

దేశంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కీలకమైన డాక్యుమెంట్‌. అనేక ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా అవసరం.  మరి ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డ్‌ను పోగొట్టుకుంటే.. ఆధార్‌ నంబర్‌ కూడా గుర్తు లేకుంటే ఏం చేయాలి.. డూప్లికేట్‌ ఆధార్‌ ఎలా పొందాలి?

ఆధార్‌ కార్డ్‌ మన రోజువారీ జీవనంలో భాగమైపోయింది. బ్యాంకు వెళ్లినా.. ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్‌ కార్డ్‌ చాలా ముఖ్యమైపోయింది. ఒక వేళ మన ఆధార్‌ కార్డ్‌ పోగొట్టుకునిపోతే ఆధార్‌ నంబర్‌ గుర్తుంటే ఈ ఆధార్‌ను డౌన్‌లోడ్‌  చేసుకోవచ్చు. మరి ఆ నంబర్‌ కూడా గుర్తు లేనప్పుడు ఆధార్‌ కార్డ్‌ను పొందడం ఎలాగో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పుడు ఆధార్‌ నంబర్‌ గుర్తు లేకపోయినా సరే ఆధార్‌ కార్డ్‌ పొందవచ్చు.

ఇదీ చదవండి: ఆధార్‌ కొత్త ఫీచర్‌: ఓటీపీ మీ మొబైల్‌ నంబర్‌కే వస్తోందా?

ఆధార్ నంబర్‌ ఉంటే..

  • https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.inని సందర్శించండి
  • ‘ఆర్డర్ ఆధార్ కార్డ్’ను క్లిక్‌ చేయండి
  • 12 అంకెల ఆధార్‌ నంబర్‌, 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ నమోదు చేయండి.
  • స్క్రీన్‌పై ఇతర వివరాలు, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్‌ చేయండి.
  • తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి
  • అనంతరం మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ వస్తుంది.
  • మళ్లీ యూఐడీఏఐ సెల్ఫ్-సర్వీస్ పోర్టల్‌ని సందర్శించి ‘డౌన్‌లోడ్ ఆధార్‌’పై క్లిక్ చేయండి.

ఆధార్ నంబర్ లేకపోతే..

  • https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uidని సందర్శించండి.
  • ఆధార్‌ నంబర్‌ కావాలో లేదా ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ కావాలో ఎంచుకోండి.
  • పేరు, మొబైల్‌ నంబర్‌ లేదా మెయిల్ ఐడీ ఎంటర్‌ చేసి సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయండి.
  • తర్వాత ఓటీపీ నమోదు చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్‌ లేదా ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ వస్తుంది.

యూఐడీఏఐ హెల్ప్‌లైన్ ద్వారా.. 

  • యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1800 180 1947 లేదా 011 1947కు డయల్ చేయండి
  • మీ ఆధార్ కార్డును తిరిగి పొందడానికి అవసరమైన ఆప్షన్‌ ఎంచుకోండి.
  • అన్ని వివరాలను నమోదు చేయండి. 
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ వస్తుంది. 
  • ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి యూఐడీఏఐ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి. 

ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్‌.. అన్నింటి కంటే తక్కువ ధరకే! 

మరిన్ని వార్తలు